నాణ్యమైన విత్తనాలు అందిస్తాం | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విత్తనాలు అందిస్తాం

Apr 22 2026 7:48 AM | Updated on Apr 22 2026 7:48 AM

నల్లగొండ టౌన్‌ : వానాకాలం వ్యవసాయ సీజన్‌లో రైతులకు నాణ్యమైన విత్తనాలు అందిసాత్మని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వేష్‌రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండలోని కలెక్టరేట్‌ ఉదయాతిద్య భవన్‌లో జిల్లాలోని విత్తన డీలర్లు, సహకార సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో సుమారు 5 లక్షల ఎకరాల్లో వరి సాగు జరగనుండగా, ఇందుకు దాదాపు 1.25 లక్షల క్వింటాళ్ల విత్తన అవసరం ఉందని అంచనా వేశామని, ఇందులో భాగంగా తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా సుమారు 50 వేల క్వింటాళ్ల విత్తనాలను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వరితో పాటు పెసర, మినుము, కంది వంటి పంటల విత్తనాల సరఫరాకు చర్యలు చేపట్టామన్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న విత్తనాలను ముందుగానే సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం అనుమతించిన విత్తనాలనే విక్రయించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. రాయితీ విత్తనాల పైనే దృష్టి పెట్టడం సరికాదని, రాయితీ లేని విత్తనాలను కూడా రైతులకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. వానాకాలానికి అవసరమైన పచ్చిరొట్ట విత్తనాలను కూడా సమయానికి సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు.

ఫ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ అన్వేష్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement