నల్లగొండ : మహిళా సాధికారత కోసం పాటుపడిన ఏకై క పార్టీ కాంగ్రెస్ అని నేత అన్నారు. నల్లగొండలోని యాదవ సంఘం భవన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ తొలి మహిళా ప్రధాని ఇందిరాగాంధీ అని ఆయన గుర్తు చేశారు. సోనియాగాంధీ యూపీఏ చైర్ పర్సన్‌గా దేశంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభివృద్ధికి అనేక సంస్కరణలు చేపట్టారని చెప్పారు. 40 సంవత్సరాల నుంచి ఉన్న బీజేపీలో మహిళలను అధ్యక్షులుగా చేశారా? ఇప్పుడు 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీలో ఎంతమంది మహిళలు ముఖ్యమంత్రులుగా ఉన్నారని ప్రశ్నించారు. డీలిమిటేషన్‌లో మహిళల బిల్లులను తీసుకురావడం పెద్ద కుట్ర అని విమర్శించారు. 2023లో ఆమోదించిన మహిళా బిల్లును ఇప్పుడున్న సభ్యుల ఆధారంగా ఆమోదించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఓబీసీ సెల్ చైర్మన్ జిల్లపల్లి పరమేష్, రవీందర్‌రెడ్డి, తోటకూరి పరుశురాములు, ముంతాజ్ అలీ, చర్లపల్లి గౌతం పగిళ్ల రాజు, రవితేజ, సాగర్‌రెడ్డి, వేముల గోపీనాథ్, అశోక్, ఇంధనూరి శీను, పరశురాం, చకిలం ఫణికుమార్, శ్రీను నాగార్జునగౌడ్, శరత్, పరశురాం, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫ డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్


