ఫ బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి
హాలియా : మహిళల రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీది చారిత్రక తప్పిదమని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్‌రెడ్డి, నాగార్జున సాగర్ నియోజకవర్గ నాయకురాలు కంకణాల నివేదితరెడ్డి అన్నారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్ వ్యవహాశైలికి నిరసనగా బీజేపీ ఆధ్వర్యంలో ఆదివారం హాలియా పట్టణంలో మహిళలు ర్యాలీ నిర్వహించి కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళా సాధికారతపై గంబీర ఉపన్యాసాలు చేసే ఇండియా కూటమి నాయకులు మహిళల హక్కుల, ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని ఆడ్డుకుంన్నారని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి మహిళల ఆశలను వమ్ము చేసిందని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, మహిళలు ఉన్నారు.


