మోత్కూరు : మండలంలోని పాలడుగు గ్రామంలో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్, ఆటోను కారు ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన ప్రకారం వివరాల ప్రకారం.. వలిగొండ మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన ముక్కెర్ల చంద్రయ్య(70) బైక్‌పై మోత్కూరు మండలంలోని పాలడుగు గ్రామంలో రోడ్డు దాటుతుండగా.. వలిగొండ నుంచి వేగంగా వచ్చిన కారు బైక్‌ను ఢీకొట్టింది. అనంతరం కారు అదుపుతప్పి పక్కనే వెళ్తున్న ఆటోను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చంద్రయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు చంద్రయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ సతీష్‌కుమార్ తెలిపారు.
ఒకరు మృతి.. ముగ్గురికి గాయాలు


