నేటి నుంచి ‘ఓపెన్‌’ పరీక్షలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ‘ఓపెన్‌’ పరీక్షలు

Apr 20 2026 9:17 AM | Updated on Apr 20 2026 9:17 AM

నేటి నుంచి ‘ఓపెన్‌’ పరీక్షలు

భువనగిరి : తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ(టాస్‌) ఆధ్వర్యంలో ఓపెన్‌ టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 27వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. తొలిసారిగా ఈ విద్యాసంవత్సరంలో ఓపెన్‌ విద్యార్థులకు వాట్సాప్‌ ద్వారా పాఠాలు బోధించడం, రెగ్యులర్‌ విద్యార్థుల మాదిరిగా పాఠ్యపుస్తకాలతో పాటు స్టడీ మెటీరియల్స్‌ అందజేశారు.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 44 పరీక్ష కేంద్రాలు

పరీక్షల నిర్వహణ కోసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 44 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థులు కలిపి 8,835 మంది పరీక్షలకు హాజరుకానున్నారు. మాస్‌ కాపీయింగ్‌ జరగకుండా ఫ్లయింగ్‌, సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలను ఏర్పాటు చేశారు. 44 మంది చీఫ్‌ సూపరింటెండెంట్లు, 44 మంది డిపార్ట్‌మెంట్‌ అధికారులను నియమించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్ష జరగనుంది.

ఏర్పాట్లు పూర్తి..

పరీక్షల నిర్వహణ కోసం అన్ని కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తిచేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని పరీక్ష కేంద్రాలలో విద్యుత్‌ సదుపాయం, తాగునీరు, ఫ్యాన్లతో పాటు మరుగుదొడ్లు, మూత్రశాలలు ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఎవరైనా విద్యార్థులు అస్వస్థతకు గురైతే వెంటనే వైద్య సేవలందించేందుకు పరీక్ష కేంద్రాలలో ఏఎన్‌ఎంలను అందుబాటులో ఉంచారు. 5 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చిన వారికి పరీక్ష కేంద్రాలలోకి అనుమతించనున్నారు. పరీక్ష కేంద్రాలలోకి సెల్‌ఫోన్లు అనుమతించబడదు.

ఉమ్మడి జిల్లాలో పరీక్ష కేంద్రాల వివరాలు ఇలా..

జిల్లా తరగతి హాజరుకానున్న పరీక్ష

విద్యార్థులు కేంద్రాలు

నల్లగొండ టెన్త్‌ 1,611 08

ఇంటర్‌ 2,226 10

సూర్యాపేట టెన్త్‌ 990 06

ఇంటర్‌ 2,012 11

యాదాద్రి టెన్త్‌ 569 04

ఇంటర్‌ 1,427 05

టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థుల కోసం

ఉమ్మడి జిల్లాలో 44 పరీక్ష కేంద్రాలు

హాజరుకానున్న 8,835 మంది విద్యార్థులు

Advertisement
 
Advertisement
Advertisement