యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట పట్టణంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఆదివారం విశ్వశాంతి మహాయాగం వైభవంగా నిర్వహించారు. అంతకుముందు ఉదయం యాదగిరిగుట్ట ఆయల రిటైర్డ్ ప్రధానార్చకుడు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు సమక్షంలో గణపతి పూజ జరిపించారు. అనంతరం 108 జంటలతో సుదర్శన నారసింహ విశ్వశాంతి మహాయాగం, 1008 మందితో లక్ష్మీనరసింహస్వామి కల్యాణం జరిపించారు. కల్యాణోత్సవం తర్వాత నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. సుమారు 3వేలకు పైగా భక్తులు ఆయా వేడుకల్లో పాల్గొన్నారు. మున్నూరు కాపు సంఘం భవనంలో నిర్వహించిన విశేష కార్యక్రమాలకు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, రాజ్యసభ మాజీ సభ్యుడు వి. హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీలు, ట్రస్టు ప్రతినిధులు పూల రవీందర్, ఆకుల లలిత, డాక్టర్ పుంజాల వినయ్‌కుమార్, రుద్ర సంతోష్‌కుమార్, పలుగుల శ్రీనివాస్, పోతంశెట్టి అనిల్‌కుమార్, పుప్పాల నరసింహులు, సంగాని రజినికాంత్, తూడి జనార్దన్, కుమారస్వామి, ఆవుల సురేందర్, ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.


