విద్యుదుత్పత్తి కేంద్రంలో మాక్‌డ్రిల్‌ | - | Sakshi
Sakshi News home page

విద్యుదుత్పత్తి కేంద్రంలో మాక్‌డ్రిల్‌

Apr 19 2026 8:17 AM | Updated on Apr 19 2026 8:17 AM

నాగార్జునసాగర్‌ : నాగార్జునసాగర్‌ జెన్‌కో ప్రధాన జల విద్యుదుత్పత్తి కేంద్రంలో శనివారం అగ్నిమాపక శాఖ మాక్‌ డ్రిల్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా జెన్‌కో చీఫ్‌ ఇంజినీర్‌ మంగేష్‌కుమార్‌ మాట్లాడుతూ ఎస్‌పీఎఫ్‌ డైరెక్టర్‌ జనరల్‌ స్వాతి లక్రా, జోన్‌ డీఐజీ మాధవరావు ఉత్తర్వుల మేరకు ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించినట్లు తెలిపారు. జల విద్యుదుత్పత్తి కేంద్రంలో అనుకోకుండా సంభవించే అగ్ని ప్రమాదాలను ఎలా అడ్డుకోవాలి, ప్రాణ, ఆస్థి నష్టం కలగకుండా ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోవాలనే విషయంలో మాక్‌ డ్రిల్‌ నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎస్‌ఈలు రఘురాం, రామకృష్ణారెడ్డి, జెన్‌కో డీఈ, ఫైర్‌ ఆఫీసర్‌ వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ ప్రతాప్‌నాయుడు, ఆర్‌ఐ శ్రీనివాసరావు ఉన్నారు.

జెన్‌కో ప్రధాన విద్యుదుత్పత్తి కేంద్రంలో మాక్‌ డ్రిల్‌ నిర్వహిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

Advertisement
 
Advertisement
Advertisement