మహిళలను కించపరిచిన ప్రతిపక్షాలు | - | Sakshi
Sakshi News home page

మహిళలను కించపరిచిన ప్రతిపక్షాలు

Apr 19 2026 8:17 AM | Updated on Apr 19 2026 8:17 AM

నకిరేకల్‌ : భారత ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన మహిళా బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించి మహిళలను కించపరిచాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ నాగం వర్షిత్‌రెడ్డి అన్నారు. శనివారం నకిరేకల్‌లో కాంగ్రెస్‌ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో సగం జనాభా ఉన్న మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారని.. కానీ, కాంగ్రెస్‌ పార్టీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తే నాయకుల ఆటలు సాగవనే భయంతో అడ్డుకున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఆపార్టీ పట్టణ అధ్యక్షుడు గర్రె మురళి మోహన్‌, కిసాన్‌ మోర్చా నాయకుడు గోలి మధుసూధన్‌రెడ్డి, చినేని జాని, యానాల శంకర్‌రెడ్డి, పల్స శ్రీనుగౌడ్‌, యానాల శ్రీనివాస్‌రెడ్డి, చెనగాని రాములు, పందాల సైదులు, పెండెం పురుషోత్తం, గాయం మహేష్‌రెడ్డి, శ్రీకాంత్‌, ఏర్పుల అంజి తదితరులు పాల్గొన్నారు.

ఫ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి

Advertisement
 
Advertisement
Advertisement