జి.ఎడవెల్లి వాగు పరిశీలన | - | Sakshi
Sakshi News home page

జి.ఎడవెల్లి వాగు పరిశీలన

Apr 19 2026 8:17 AM | Updated on Apr 19 2026 8:17 AM

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : కనగల్‌ మండల పరిధిలోని జి.ఎడవెల్లి వాగును శనివారం అధికారులు సందర్శించారు. అనుమతులు లేకుండా వాగులో నెల రోజుల నుంచి ఇసుక తవ్వకాలు జరుపుతుండటంతో ‘తోడెయ్‌.. అమ్మెయ్‌’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఎస్పీ శరత్‌ చంద్రపవార్‌ ఆదేశాల మేరకు వాగులో ఇసుక తవ్వకాలు జరిపిన స్థలాన్ని సీఐ ఆదిరెడ్డి, తహసీల్దార్‌ పద్మ, ఆర్‌ఐ సునీత, మైనింగ్‌ శాఖ అధికారి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జి.యడవల్లి వాగు నుంచి ఇసుక తవ్వకానికి ఎలాంటి అనుమతులు లేవని.. జేసీబీలతో అక్రమంగా తవ్వకాలు జరిపితే కఠిన తప్పవని హెచ్చరించారు. వాగు నుంచి అక్రమ రవాణా సాగించే దారుల్లో గుంతలు తీయిస్తామన్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా.. ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మెపాలని ఎస్పీ ఆదేశించినట్లు పోలీసులు పేర్కొంటున్నారు.

కక్షిదారులకు సత్వర న్యాయం అందించాలి

దేవరకొండ : కక్షిదారులకు సత్వర న్యాయం అందేలా న్యాయవాదులు కృషి చేయాలని జిల్లా ఫోక్సో కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కులకర్ణి విశ్వనాథ్‌ దిలీప్‌రావు అన్నారు. శనివారం ఆయన దేవరకొండ అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు వివరాలను అడిగి తెలుసుకున్నారు. బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అనంతరం కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కెవిఎస్‌.హరీష్‌బాబు, అడిషనల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి స్నేహ, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఉమమహేష్‌, వనం జగదీష్‌, న్యాయవాదులు గాజుల ఆంజనేయులు, నెమ్మికంటి గౌరీశంకర్‌, నెమ్మికంటి రమాశంకర్‌, షౌకత్‌అలీ, ఇంద్ర వరప్రసాద్‌, అశోక్‌గౌడ్‌, రవి, శ్రీకాంత్‌, ఇద్దయ్య, గణేష్‌, ఆంజనేయులు, కృష్ణ, సురేష్‌, సాయి, శేఖర్‌ తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement