చెర్వుగట్టులో లక్ష పుష్పార్చన | - | Sakshi
Sakshi News home page

చెర్వుగట్టులో లక్ష పుష్పార్చన

Apr 18 2026 7:23 AM | Updated on Apr 18 2026 7:23 AM

నార్కట్‌పల్లి : మండలంలోని చెర్వుగట్టు గ్రామంలో గల శ్రీపార్వతి జడలరామలింగేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం రాత్రి అమావాస్య పూజలు కొనసాగాయి. ప్రధానంగా లక్ష పుష్పార్చన ప్రత్యేక పూజ ఆలయ ప్రధాన అర్చకులు పోతులపాటి రామలింగేశ్వర శర్మ, సతీష్‌ శర్మ, సురేష్‌ శర్మ, శ్రీకాంత్‌ శర్మ, అర్చకుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. అమావాస్య కావడంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలు కోలాహలంగా మారాయి. గట్టుపైన ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా ఎస్‌ఐ విష్ణుమూర్తి ఆధ్వర్యంలో తగిన చర్యలు తీసుకున్నారు. పూజ కార్యక్రమంలో చెర్వుగట్టు సర్పంచ్‌ నేతగాని కృష్ణ, ఈఓ మోహన్‌బాబు, ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్‌ వరాల రమేష్‌, వార్డు సభ్యులు శ్రీకాంత్‌, సాయి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement