భానుడు @41 డిగ్రీలు | - | Sakshi
Sakshi News home page

భానుడు @41 డిగ్రీలు

Apr 18 2026 7:23 AM | Updated on Apr 18 2026 7:23 AM

నల్లగొండ టౌన్‌ : భానుడు నిప్పుల కొలిమిలా మండుతున్నాడు. రోజురోజుకు తన ప్రతాపాన్ని చూపుతుండడంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. శుక్రవారం నల్లగొండ పట్టణంలో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో ప్రజలు ఉదయం 10 గంటల నుంచి బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు. ఎండ తీవ్రతకు తట్టుకోలేక ప్రజలు ఇళ్లకు పరిమితమై ఏసీలు, కూలర్ల ద్వారా సేదదీరుతున్నారు. ఈ నెలాఖరు వరకు ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందనే ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ

పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ప్రజలకు కరపత్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. అన్ని ప్రాథమిక, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, పల్లె, పట్టణ దవాఖానాలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో, ఉపాధి సిబ్బంది, ఆశా వర్కర్ల వద్ద ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లతోపాటు వడదెబ్బ బాధితులకు వైద్యం అందించేందుకు అవసరమైన మందులు, సైలెన్‌ బాటిల్లు సిద్ధంగా ఉంచారు. జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ర్యాపిడ్‌ రెస్పాన్స్‌ బృందాలను ఏర్పాటు చేసింది. జిల్లాలో ఎక్కడైనా వేసవిలో వచ్చే జబ్బులు ప్రబలి ప్రజలు ఇబ్బంది పడితే వెంటనే ఆ బృందాలు ఆ గ్రామాలకు చేరుకుని వైద్య చికిత్స అందించనున్నారు.

ఫ నల్లగొండ పట్టణంలో గరిష్ట ఉష్ణోగ్రత నమోదు

ఫ పెరుగుతున్న ఎండలతో జనం బెంబేలు

ఫ అప్రమత్తంగా ఉండాలంటున్న జిల్లా వైద్యారోగ్య శాఖ

ఈ నెలలో గరిష్ట

ఉష్ణోగ్రతల

నమోదు ఇలా..

తేదీ డిగ్రీల

సెల్సియస్‌

2 36.5

8 37.5

14 38.5

15 39.5

16 40

Advertisement
 
Advertisement
Advertisement