ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు అర్థరహితం | - | Sakshi
Sakshi News home page

ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు అర్థరహితం

Apr 18 2026 7:23 AM | Updated on Apr 18 2026 7:23 AM

నల్లగొండ : పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య.. తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్‌–భారత్‌ విభజనతో పోల్చడడం అర్థ రహిత మని జిల్లా డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్‌ అన్నారు. ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలను ఖండిస్తూ నల్లగొండలోని గడియారం సెంటర్‌లో శుక్రవారం కాంగ్రెస్‌ నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా పున్న కై లాష్‌ మాట్లాడుతూ బలిదానాలు, త్యాగాలను అవహేళన చేస్తున్న బీజేపీ తెలంగాణలో భూస్థాపితం కావడం ఖాయమన్నారు. నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్‌రెడ్డి లేవనెత్తిన వాటికి సమాధానాలు చెప్పకుండా ప్రధాని మోదీ, అమిత్‌సా కుట్ర పన్నుతున్నారన్నారు. ఎంపీ తేజస్వీ వ్యాఖ్యలకు ప్రధాని మోదీ.. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకలు ముంతాజ్‌ అలీ, పెరిక వెంకటేశ్వర్లు, జిల్లేపల్లి పరమేష్‌, నోముల జనార్దన్‌, కోమటిరెడ్డి అంజిరెడ్డి, చింతమల్ల వెంకటయ్య, వేముల గోపినాథ్‌, తగుళ్ల రాజు, చర్లపల్లి గౌతమ్‌, సాగర్‌రెడ్డి, హరీష్‌, పల్లా రవితేజ, వెంకన్న, శ్రీను, అంజయ్య, అజీజ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement