● కలెక్టర్ చంద్రశేఖర్
కనగల్ : ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ చంద్రశేఖర్ హెచ్చరించారు. కనగల్ మండలంలోని జి.యడవల్లి, కనగల్ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను గురువారం రాత్రి కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి ధాన్యం కొనుగోలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. మిల్లర్లు ధాన్యం దిగమతి ఆలస్యం చేయొద్దన్నారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యం తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాలు సమస్య పరిష్కారం కోసం శుక్రవారం రైస్ మిల్లర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ వెంట డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ పద్మ, ఏఓ బెజవాడ అమరేందర్‌గౌడ్, ఎస్‌ఐ రాజీవ్‌రెడ్డి సర్పంచ్ వెంకటేశం, సీసీలు విజయ్‌కుమారి, ప్రభాకర్ తదితరులు ఉన్నారు.


