నకిరేకల్‌లో నేడు ‘అరైవ్‌ అలైవ్‌’ | - | Sakshi
Sakshi News home page

నకిరేకల్‌లో నేడు ‘అరైవ్‌ అలైవ్‌’

Apr 15 2026 8:32 AM | Updated on Apr 15 2026 8:32 AM

హాజరుకానున్న డీజీపీ శివధర్‌రెడ్డి

నకిరేకల్‌ : ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో బుధవారం నకిరేకల్‌ మినీ స్టేడియంలో ‘అరైవ్‌–అలైవ్‌’ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. నకిరేకల్‌ నియోజకవర్గం నుంచి 65వ నంబర్‌ జాతీయ రహదారి వెళ్తున్నందు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించే సభకు ముఖ్య అతిథిగా డీసీపీ శివధర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరుకానున్నారు. ఈ సభ ఏర్పాట్లను మంగళవారం రాత్రి డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐలు హరిబాబు, కొండల్‌రెడ్డి పరిశీలించారు.

గురుకులంలో ప్రవేశాలకు దరఖాస్తులు

రామగిరి (నల్లగొండ) : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలైన సీఓఈ, రెగ్యులర్‌ జూనియర్‌ కాలేజీలు, వృత్తి విద్య, సైనిక కళాశాలల్లో ఇంటర్‌లో చేరేందుకు ప్రవేశ పరీక్ష కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ఆర్‌సీఓ ఎస్‌.విద్యావాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. rjcet.tela ngana.gov.in లేదా tgswreis.telanga na.gov.in వెబ్‌సైట్‌ ద్వారా ఏప్రిల్‌ 25లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మే 15న ఉదయం 10 గం నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొన్నారు.

టీఎస్‌ యూటీఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవం

నకిరేకల్‌ : టీఎస్‌ యూటీఎఫ్‌ 13వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం నకిరేకల్‌ పట్టణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నకిరేకల్‌ ఏరియా ఆస్పత్రిలో రోగులకు పండ్లు, బ్రేడ్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడంలో యూటీఎఫ్‌ పాత్ర కీలకమన్నారు. ఉపాద్యాయులంతా సంఘంలో చేరి సంఘ బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యాట మధుసూదన్‌రెడ్డి, జిల్లా ఆడిట్‌ కమిటీ సభ్యుడు తాటిపాముల నర్సింహమూర్తి, స్టడీ సర్కిల్‌ కన్వీనర్‌ ఆర్‌.రాకేష్‌కుమార్‌, కేతేపల్లి, శాలిగౌరారం, నకిరేకల్‌ మండలాల ప్రధాన కార్యదర్శులు పి.జయసాగర్‌, కె.రవికుమార్‌, ఈ.హరికృష్ణ, నాయకులు పండుగ తిరుమలయ్య, బి.వేణుగోపాల్‌, వి.శ్రీనివాస్‌, చక్రపాణి, బి.శ్రీనివాస్‌, కిషోర్‌, ఎం.మల్లేష్‌, రామకృష్ణరెడ్డి, లింగాల నగేష్‌, శ్యామయ్య తదితరులు పాల్గొన్నారు.

క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఆకుపూజ

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం విశేష పూజలు కొనసాగాయి. క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఆకుపూజను అర్చకులు విశేషంగా నిర్వహించారు. వేకువజామునే ప్రధానాలయాన్ని తెరచిన అర్చకులు సంప్రదాయ పద్ధతిలో సుప్రభాతం చేపట్టారు. అనంతరం బిందెతీర్థం, బాలభోగం, హారతి నివేదన వంటి పూజలను జరిపించారు. స్వయంభూలకు పంచామృతాలతో అభిషేకం, తులసీ దళాలతో అర్చన జరిపారు. ఇక క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామికి ఇష్టమైన రోజు కావడంతో విష్ణు పుష్కరిణి వద్ద హనుమాన్‌ ఆలయంలో తమలపాకులతో విశేషంగా పూజలు చేశారు. సింధూరంతో అభిషేకించిన శ్రీఆంజనేయస్వామిని తమలపాకులతో అర్చన జరిపారు. ఇక శ్రీస్వామి వారి ప్రధానాలయంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, జోడు సేవలను భక్తుల మధ్యన నిర్వహించారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement