అంగన్‌వాడీలకు ‘స్మార్ట్‌’ కళ | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీలకు ‘స్మార్ట్‌’ కళ

Apr 15 2026 8:32 AM | Updated on Apr 15 2026 8:32 AM

ఫోన్‌లోనే సమగ్ర సమాచారం

రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ టీచర్లకు అన్ని ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేసింది. అంగన్‌వాడీలకు సంబంధించిన సమగ్ర సమాచారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల యాప్‌లలో నమోదు చేయాల్సి ఉంటుంది. అంగన్‌వాడీ కేంద్రం తెరిచినప్పటి నుంచి మూసి వేసేంత వరకు అన్ని వివరాలు నమోదు చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీల ద్వారా అందించే సంక్షేమ పథకాల సమగ్ర సమాచారం యాప్‌లలో నిక్షిప్తం చేస్తాం.

– రేఖల మమత, సీడీపీఓ, మిర్యాలగూడ

మిర్యాలగూడ టౌన్‌ : పిల్లలకు ఆట పాటలతో కూడిన పూర్వ ప్రాథమిక విద్యను అందించడంతో పాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం పంపిణీ చేయడంలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అయ్యే సరుకులు, లబ్ధిదారులు, పౌష్టికాహారం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసే విషయంలో ఇబ్బందులను అధిగమించేందుకు ప్రభుత్వం అంగన్‌వాడీ కార్యకర్తలకు స్మార్ట్‌ఫోన్లు అందించింది. ప్రతి అంగన్‌వాడీ కార్యకర్తతోపాటు సూపర్‌వైజర్లు, డీపీపీఓలు, పైఅధికారులకు కూడా ఫోన్లు పంపిణీ చేసింది. అన్ని వివరాలను మోబైల్‌ యాప్‌లోనే అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించింది.

అన్ని ఫీచర్లతో కూడిన ఫోన్లు..

అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నారు. ప్రధానంగా రైస్‌, దాల్‌, గ్రీన్‌ వెజిటెబుల్‌, ఉడకబెట్టిన కోడిగుడ్డు, పాలు అందిస్తున్నారు. పౌష్టికాహారం పంపిణీలో పారదర్శకత కోసం వీటి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన ‘పోషణ్‌ ట్రాకర్‌’ యాప్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ‘ఎన్‌హెచ్‌టీఎస్‌’ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే గతంలో ఇచ్చి 2 జీబీ ర్యామ్‌ ఫోన్లలో సాంకేతిక సమస్య వస్తుండడంతో ప్రస్తుతం 4జీబీ ర్యామ్‌తో అన్ని ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్లను ఇందుకోసం అంగన్‌వాడీ టీచర్లకు పంపిణీ చేసింది. ప్రస్తుతం అంగన్‌వాడీలకు ఇచ్చిన ఫోన్లకు ప్రభుత్వమే రీచార్జ్‌ చేయిస్తుంది.

యాప్‌లో నమోదు చేయాల్సిన అంశాలు

● అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న పౌష్టికాహారం వివరాలు.

● గర్భిణులు, బాలింతలు, చిన్నారుల వివరాలు.

● అంగన్‌వాడీ కేంద్రాలు తెరిచే సమయం, మూసివేసే సమయం.

● పిల్లల బరువు, ఎత్తు, పిల్లల రక్తహీనత ఉంటే అందుకు గల కారణాలు నమోదు.

● అంగన్‌వాడీల గృహా సందర్శన నమోదు.

● అన్నీ రకాల రిజిస్టర్లు వివరాలు.

● పిల్లలకు అందించే బాలామృతం, మురుకులుతో పాటు ఆరోగ్యలక్ష్మి పథకం వివరాలు.

● బ్ధిదారుల ఫెస్‌ రికగ్నిషన్‌ హాజరు.

● ఐసీడీఎస్‌కు సంబంధించిన వివరాలు, కేంద్ర, రా ష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వివరాలను నమోదు చేయించాల్సి ఉంటుంది.

ఫ మొబైల్‌ ఫోన్లు పంపిణీ చేసినప్రభుత్వం

ఫ సమగ్ర సమాచారం ఇక యాప్‌లోనే నిక్షిప్తం

ఫ పౌష్టికాహార పంపిణీలో పారదర్శకతే లక్ష్యం

ఫ వివరాల నమోదు ఇక సులభం

Advertisement
 
Advertisement
Advertisement