తిప్పర్తి : కొనుగోలు కేంద్రాల్లో జాప్యం లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం తిప్పర్తిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. కేంద్రంలో రికార్డులు పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని నిర్ధేశిత తేమ శాతం వచ్చాక సీరియల్ ప్రకారం కాంటాలు వేసి మిల్లులకు పంపాలన్నారు. ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 426 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించగా ఇప్పటివరకు 286 కేంద్రాలను ప్రారంభించామని తెలిపారు. రైతులు నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలన్నారు.
డబుల్ బెడ్‌రూం ఇళ్ల పరిశీలన
తిప్పర్తి మండల కేంద్రంలో అసంపూర్తిగా ఉన్న డబుల్‌బెడ్‌రూం ఇళ్లను కలెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు. ఇళ్ల పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ శ్రీనివాస్, ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ అశోక్‌రెడ్డి, హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్ తదితరులు ఉన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


