మిర్యాలగూడ టౌన్ : దేశం కోసం, ధర్మం కోసం, సంఘం అభివృద్ధి కోసం హిందువులంతా ఐక్యతతో ముందుకు సాగితే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్ అన్నారు. మంగళవారం మిర్యాలగూడలోని వెంకటేశ్వరస్వామి దేవాలయం ఆవరణలో నిర్వహించిన హింధూ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ హింధూ ఐక్యమత్యాన్ని బలోపేతం చేయాలన్నారు. వీర బ్రహ్మంద్రస్వామి పీఠాధిపతి విశ్వబ్రహ్మ వీరధర్మజ స్వామిజీ మాట్లాడుతూ హిందువుల ఐక్యతను దెబ్బతీసేందుకు అనేక మంది ప్రయత్నించినా సనాతన ధర్మాన్ని ఏమాత్రం కదలించలేకపోయారని చెప్పారు. కార్యక్రమంలో స్వదేశీ జాగరణ మంచ్ తెలంగాణ ప్రాంత మహిళా ప్రముఖ్ డాక్టర్ కళ్లెం స్వప్న, నగర కార్యవాహా సుధాకర్, గూడూరు శ్రీనివాస్‌రావు, తిప్పన వెంకటేశ్వర్‌రెడ్డి, బొలిశెట్టి భిక్షపతి, సంపత్‌కుమార్, జయరాజ్, మునగాల మట్టారెడ్డి, బంటు గిరి, సాధినేని శ్రీనివాస్‌రావు, తుమ్మలపల్లి హన్మంతరెడ్డి, అశోక్‌రెడ్డి తదితరులున్నారు.
ఫ ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ లింగం శ్రీధర్


