నల్లగొండ : జీవవిచ్ఛిన్నకర వ్యర్థాల శాసీ్త్రయ నిర్వహణపై దృషి్‌ట్ సారించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలకు చెందిన సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యంతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మిర్యాలగూడ, చందనపల్లి డంపింగ్ యార్డుల్లోని ఘన వ్యర్థాల రీసైక్లింగ్‌పై దృష్టి కేంద్రీకరిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యం ఇందుకు సహకరించాలని సూచించారు. డంపింగ్ యార్డ్ నుంచి 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పరిశ్రమలు కనీసం 6 శాతం ఆర్‌డీఎఫ్ (రిప్యూజ్ డైరెవ్డ్ ఫ్యూయల్) వినియోగం చేపట్టాలన్నారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ శ్రీదేవి, పరిశ్రమల మేనేజర్ సతీష్, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి విజయేందర్‌రెడ్డి, సిమెంట్ ఫ్యాక్టరీల ప్రతినిధులు పాల్గొన్నారు.


