ఉద్యోగం ఇప్పించండి సారూ.. | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగం ఇప్పించండి సారూ..

Apr 14 2026 8:28 AM | Updated on Apr 14 2026 8:28 AM

నల్లగొండ : మిర్యాలగూడ పట్టణం బంగారుగడ్డకు చెందిన సుంకోజు వెంకటాచారి–కళావతి దంపతుల కుమార్తె శివాని పుట్టుకతో లోకోమోటో వ్యాధి (ఎదుగుదల లేని)తో బాధ పడుతోంది. లోపాన్ని లెక్క చేయకుండా శివాని తండ్రి సహకారంతో ఎంకాం వరకు చదువుకుంది. తండ్రి బైక్‌ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ప్రస్తుతం ఆమె మిర్యాలగూడలో ప్రైవేట్‌ జాబ్‌ చేస్తోంది. కాగా తనకు ఏదేని ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ సోమవారం ప్రజావాణితో శివాని తండ్రితో కలిసి కలెక్టర్‌కు వినతి పత్రం అందజేసింది.

Advertisement
 
Advertisement
Advertisement