అంగన్‌వాడీల వివరాలు
మిర్యాలగూడ టౌన్ : తల్లి పిల్లల సంరక్షణే ధ్యేయంగా ప్రభుత్వాలు ‘పోషణ పక్షోత్సవాలు’ (పోషణ పక్వాడ) నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా పోషకాహారంపై విస్తృత అవగాహన కల్పించేందుకు అధికారులు సమగ్ర కార్యాచరణ రూపొందించారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే ఈ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే ప్రధాన లక్ష్యంతో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్, పోషణ్ ట్రాకర్, ఆరోగ్యలక్ష్మి వంటి తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీప్రజా పాలన–ప్రగతి ప్రణాళికశ్రీలో భాగంగా ఈనెల 9వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా ఈ నెల 23వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తల్లీబిడ్డ ఆరోగ్యం, వారికి పౌష్టికాహారం ఇవ్వడం వంటి కార్యక్రమాలను అంగన్‌వాడీ టీచర్లు చేపడుతూ.. సంబంధిత యాప్‌లో వివరాలను నమోదు చేస్తున్నారు.
పోషణ కార్యక్రమాల్లో కొన్ని ఇలా..
ఫ పిల్లల పోషణపై ప్రధాన చర్చ జరిగేలా టాక్ షోలు, చర్చలు, సభలను నిర్వహిస్తారు.
ఫ తల్లిపాలపై అవగాహన కల్పిస్తారు.
ఫ అంగన్‌వాడీ కేంద్రాల్లో అమ్మమ్మ, నానమ్మలతో పోషణ కథలను చెప్పిస్తారు.
ఫ గర్భిణులు పిల్లల కోసం ప్రత్యేక పోషణ, ఆరోగ్య శిబిరాలను నిర్వహిస్తారు.
ఫ చిరు ధాన్యాలతో ఆహారపదార్థాలను తయారు చేయడం, వాటిని ప్రదర్శించడం.
ఫ పెషణ మేళా, క్విజ్ పోటీలు, పూర్వ ప్రాథమిక విద్యపై ప్రచారం.
ఫ అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రీ స్కూల్, సంసిద్ధత కార్యకలాపాలు, గ్రాడ్యుయేషన్ డే
ఫ నో స్క్రీన్ అవర్, ఫ్యామిలీ ఫ్లే టైంపై ప్రచారం, బహిరంగ ఆటలు, శారీరక కార్యక్రమాలు, క్రీడలు, ఇతర కార్యక్రమాలు 15 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాల ఫొటోలు, వీడియోలు తీసి యాప్‌లో నమోదు చేస్తారు.
ఫ 23వ తేదీ వరకు అంగన్‌వాడీల్లో
పోషణ పక్షోత్సవాలు
ఫ పౌష్టికాహారం, పూర్వ ప్రాథమిక విద్యపై అవగాహన కల్పించడమే లక్ష్యం
ఫ వేసవి దృష్ట్యా తగు జాగ్రత్తలతో
కార్యక్రమం నిర్వహణ
ప్రాజెక్టులు 9
కేంద్రాలు 2093
0 నుంచి మూడేళల్లోపు పిల్లలు 49,620
3 నుంచి 6 ఏళ్లలోపు 36,181
గర్భిణులు 10051
బాలింతలు 6001


