నల్లగొండ : తిప్పర్తి జంక్షన్‌లో సుందరీకరణ పనుల్లో ఏర్పాటు చేసిన అంబేద్కర్, జగ్జీవన్‌రామ్ విగ్రహాలను మంగళవారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి ఆవిష్కరించనున్నారు. అనంతరం అక్కడ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. నల్లగొండ నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఎంజీయూ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు
నల్లగొండ టూటౌన్ : మహాత్మాగాంధీ యూనివర్సిటీలో 113 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు విడుదల చేశారు. ఎంజీ యూనివర్సిటీలో 113 మంది ఉద్యోగులకు సంబంధించిన ఔట్‌సోర్సింగ్ ఏజెన్సీ రూ.99 లక్షల జీఎస్టీ చెల్లించకపోవడంతో జీఎస్టీ అధికారులు యూనివర్సిటీ అధికారులకు, ఏజెన్సీకి నోటీస్‌లు ఇచ్చిన విషయం తెలిసిందే. దాంతో తర్జనభర్జన పడిన యూనివర్సిటీ అధికారులు తాత్కాలికంగా మరో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా 113 మంది ఉద్యోగులకు వేతనాలను విడుదల చేశారు.
యువికాకు కేవీఎస్
విద్యార్థి ఎంపిక
రామగిరి(నల్లగొండ) : నల్లగొండ కేంద్రియ విద్యాలయంలో (కేవీఎస్) 10వ తరగతి చదువుతున్న పున్న సుధీష్ణ ఇస్రో ప్రతిష్టాత్మక యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ (యువికా–2026)కు ఎంపికయ్యారు. మే 10వ తేదీ నుంచి హైదరాబాద్‌లోని ఎన్‌ఆర్‌ఎస్‌సీలో జరిగే కార్యక్రమంలో సుధీష్ణ పాల్గొంటారు. ఈ సందర్భంగా సోమవారం కేవీఎస్ ప్రిన్సిపాల్ జి.శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం, దేశవ్యాప్తంగా దాదాపు లక్ష మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా కేవలం 300 నుంచి 350 మంది విద్యార్థులు మాత్రమే యువికాకు ఎంపికవుతారని తెలిపారు.
మహా శివుడికి
సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి అనుబంధంగా కొనసాగుతున్న శ్రీపర్వత వర్ధిని సమేత రామలింగేశ్వస్వామి వారి ఆలయంలో సోమవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. మహా శివుడికి ఇష్టమైన రోజు కావడంతో విశేషంగా అభిషేకం, బిల్వార్చన పూజలను జరిపించారు. ముఖ మండపంలోని శ్రీస్పటిక రామలింగేశ్వరుడికి పూజారులు బిల్వ పత్రాలతో పూజలు, భక్తులచే అష్టోత్తర పూజలు నిర్వహించారు. సాయంత్రం వేళ శివాలయంలో శ్రీరామలింగేశ్వర సమేత పార్వ తీ దేవి సేవను ఊరేగించారు. యాదగిరీశుడి ప్రధానాలయంలో నిత్య కై ంకర్యాలను అర్చకులు సంప్రదాయంగా జరిపించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఆయా పూజల్లో భక్తులు మొక్కులు తీర్చుకున్నారు.


