నల్లగొండ : ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియామాలు పాటించాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాంగా సోమవారం నల్లగొండలోని రవాణా శాఖ కార్యాలయంలో ఏర్పాటుచేసిన రోడ్డు భద్రతా వారోత్సవాల అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమం ఉంటున్నారు. జిల్లాలో ఉన్న ఐదు నేషనల్ హైవేలు, రెండు స్టేట్ హైవేలపై తరచుగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి, ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రత మీద రూపొందించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ప్రచార రథాన్ని ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన వారందరి చేత రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో ఏఎస్పీ రమేష్, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ వాణి, డీటీఓ లావణ్య, వన్‌టౌన్ సీఐ రాజశేఖర్‌రెడ్డి, ఆర్టీఏ మెంబర్ ఆదిరెడ్డి, ఎంపీఐలు కొండయ్య, భాస్కర్‌రెడ్డి, చిరంజీవి, గోపీనాథ్, ఉషశ్రీ, సోనుప్రియ, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


