న్యాయవ్యవస్థ బలోపేతానికి కృషి | - | Sakshi
Sakshi News home page

న్యాయవ్యవస్థ బలోపేతానికి కృషి

Apr 14 2026 8:28 AM | Updated on Apr 14 2026 8:28 AM

రామగిరి(నల్లగొండ) : న్యాయ వ్యవస్థ బలోపేతానికి కృషి చేస్తానని న్యాయమూర్తి ఎం.నాగరాజు అన్నారు. బదిలీపై వెళ్తున్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజు, జిల్లా మొదటి అదనపు జడ్జి జి.సంపూర్ణఆనంద్‌ను బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం సన్మానించారు. ఈ సందర్భంగా జడ్జి ఎం.నాగరాజు మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లా న్యాయవాదులతో ఉన్న అనుబంధం మర్చిపోలేనిది అన్నారు. ఎక్కడ పనిచేసినా సత్వర న్యాయం అందేందుకు కృషి చేస్తానన్నారు. మానవతా దక్పదం ఉన్నచోట న్యాయం, ధర్మం నిలబడుతుందన్నారు. లోక్‌ అదాలత్‌లో నల్లగొండ జిల్లాకు మంచి స్థానం రావడంలో అధికారులు, న్యాయవాదులు అందించిన సహకారం ప్రశంసనీయమన్నారు. జిల్లా మొదటి అదనపు న్యాయమూర్తి జి.సంపూర్ణ ఆనంద్‌ మాట్లాడుతూ న్యాయవాదులు అందించిన సహకారంతోనే ఇక్కడ సుదీర్ఘకాలం పని చేయగలిగాని చెప్పారు. కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సతీష్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శి బచ్చనబోయిన అశోక్‌ కుమార్‌, న్యాయవాదులు రామచందర్‌రావు, మునగాల నారాయణరావు, నూకల నరసింహారెడ్డి, అమరేందర్‌రెడ్డి, జి.జవహర్‌లాల్‌, మేడ మోహన్‌రెడ్డి, బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షులు పి.స్వామిగౌడ్‌, నూకల సంధ్యారాణి, సహాయ కార్యదర్శి సూరేపల్లి అమరావతి, కోశాధికారి ఎండీ.ఫిరోజ్‌, గేమ్స్‌ సెక్రటరీ ప్రసన్నకుమార్‌, నగేష్‌, గుర్రం వెంకట్‌రెడ్డి, పులిజాల కార్తీక్‌, రామకష్ణ, సుమశ్రీ, భాగ్యమ్మ, పందుల సైదులు, దువ్వ గీత, ఎం.ప్రగతి, కేఎన్‌.కుమార్‌ పాల్గొన్నారు.

ఫ న్యాయమూర్తి ఎం.నాగరాజు

Advertisement
 
Advertisement
Advertisement