‘ప్రజావాణి’ ఫిర్యాదులు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

‘ప్రజావాణి’ ఫిర్యాదులు పరిష్కరించాలి

Apr 14 2026 8:28 AM | Updated on Apr 14 2026 8:28 AM

నల్లగొండ : ప్రజావాణి ఫిర్యాదులను అధికారులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల ఫిర్యాదులను ఆయన స్వీకరించి మొత్తం 71 ఫిర్యాదులు రాగా.. వాటిని పరిష్కారం నిమిత్తం ఆయా శాఖలకు పంపారు. ఈ సందర్భంగా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. మండల ప్రత్యేక అధికారులు ధ్యాన్యం కొనుగోలు కేంద్రాలను తప్పనిసరిగా సందర్శించాలని సూచించారు. రైతులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. హాస్టళ్ల తనిఖీల్లో భాగంగా ఎంఎస్‌ఓలు, ఆర్‌సీఓలు, ప్రిన్సిపాళ్లు, ఆయా విభాగాల నుంచి నివేదికలు సమర్పించాలన్నారు. పంచాయతీల్లో కుక్కల సంఖ్యపై సమాచారం సేకరించాలన్నారు. ఈ నెల 15 నుంచి కలెక్టరేట్‌ సిబ్బంది హెల్మెట్‌ ధరించి కార్యాలయానికి రావాలన్నారు. హెల్మెట్‌ లేని వారికి కార్యాలయంలోకి అనుమతించమన్నారు. గ్రీవెన్స్‌కు దరఖాస్తులు సమర్పించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, ఇన్‌చార్జి అదనపు కలెక్టర అశోక్‌రెడ్డి, ఆర్డీఓలు శ్రీదేవి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ చంద్రశేఖర్‌

Advertisement
 
Advertisement
Advertisement