నల్లగొండ : పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారంతో ముగిశాయి. మార్చి 14న ప్రారంభమైన పరీక్షలు నెలరోజుల పాటు కొనసాగాయి. చివరి రోజు జరిగిన సాంఘిక శాస్త్రం పరీక్షకు 19,698 మంది రెగ్యులర్ విద్యార్థులకు 19,661 మంది పరీక్ష రాశారు. 37 మంది గైర్హాజరయ్యారు. 13 మంది ప్రైవేట్ విద్యార్థులకు 12 మంది పరీక్ష రాయగా ఒకరు పరీక్షకు హాజరు కాలేదని డీఈఓ భిక్షపతి తెలిపారు. పరీక్షలు ముగియడంతో పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు కేరింతలు కొడుతూ కనిపించారు. హాస్టల్‌లో ఉండే విద్యార్థులు తమ లగేజీని సద్దుకొని ఇంటిబాట పట్టారు.


