నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలి
నల్లగొండ టౌన్ : తుపాను కారణంగా పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. మంగళవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని, పత్తిని ఎలాంటి షరుతులు లేకుండా మద్దతు ధరకు కోనుగోలు చేయాలన్నారు. వరి ఎకరానికి రూ.40 వేలు, పత్తికి ఎకరానికి రూ.60 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 26న ఖమ్మం పట్టణంలో నిర్వహించే సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు బహిరంగ సభకు వేలాదిగా తరలా లని పిలుపునిచ్చారు. ఈ నెల 17న బహిరంగ సభ ప్రచార జాత జిల్లాలోని డిండి మండల కేంద్రానికి చేరుకుని జిల్లాలోని దేవరకొండ, మునుగోడు, నకిరేకల్, నల్లగొండ, మిర్యాలగూడ నియోజకవర్గాల సాగుతుందన్నారు. కార్యక్రమంలో బొలుగూ రి నర్సింహ, పబ్బు వీరస్వామి, కెఎస్‌రెడ్డి, గంట సత్యనారాయణ, దోటి పాండరి, రాంకోటి, జిల్లా యాదయ్య, జోగు సురేందర్, కట్ట వెంకన్న, యా ద య్య, లెనిన్, ముత్యాలు, కౌసల్య, యూసూఫ్, విజ య, నాగమ్మ, లక్ష్మి, నందన్ అశోక్ పాల్గొన్నారు.


