ఫ పరిమితికి మించి
నేడు కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక
హాలియా : నల్లగొండ జిల్లా జూనియర్ కబడ్డీ జట్ల ఎంపిక అనుముల మండలం మదారుగూడెం ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఈనెల 5వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్.భూలోకరావు, కర్తయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాల, బాలికల జట్లను ఎంపిక చేస్తామని, బాలురు 75 కిలోలు, బాలికలు 70 కేజీలు, వయస్సు 20 సంవత్సరాలు మించని వారు అర్హులని తెలిపారు.
ఎన్‌సీసీ క్యాడెట్లకు శిక్షణ
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ 31వ బెటాలియన్ ఆధ్వర్యంలో పోలీస్ శిక్షణ కేంద్రంలో ఎన్‌సీసీ క్యాడెట్ల శిక్షణ తరగతులు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఎంజీ యూనివర్సిటీ ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సర విద్యార్థులు శిక్షణకు హాజరు కాగా వారికి డ్రిల్ మెళకువలు, దేశసేవ, ఆర్మీ ఉద్యోగాల సమాచారం, యోగా, ఫిజికల్ వ్యాయామ నియమాలు తదితర అంశాలపై కల్నల్ లక్ష్మారెడ్డి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సేబేదార్ మేజర్ మాధవరావు, కొమ్ము శ్రీధర్‌రావు, ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ సీహెచ్. సుధారాణి, ఎన్‌సీసీ ఆఫీసర్ మశ్చేందర్ పాల్గొన్నారు.
ఐసీడీఎస్ సూపర్‌వైజర్‌కు షోకాజ్ నోటీసు
కేతేపల్లి: ఐసీడీఎస్ కేతేపల్లి మండల సూపర్‌వైజర్ కళావతికి జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ నుంచి మంగళవారం షోకాజ్ నోటీసు వచ్చింది. కేతేపల్లి మండలంలోని కాసనగోడు గ్రామంలో ఈ నెల 3న అంగన్‌వాడీ కేంద్రానికి వచ్చిన నాలుగేళ్ల బాలుడు కుంచం అయాన్ ఆరుబయట ఉన్న నీటి గుంతలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ లోపం, కేంద్రాల నిర్వహణపై అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు సరైన సూచనలు, ఆదేశాలు ఇవ్వడంలో సూపర్‌వైజర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని కళావతిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాల్సిందిగా అధికారులు ఆ షోకాజ్ నోటీసులో పేర్కొన్నట్లు తెలిసింది. ఈ నెల 6వ తేదీలోగా వివరణ సమర్పించాలని ఆదేశించినట్లు సమాచారం. దీంతోపాటు ఘటన జరిగిన కాసనగోడు అంగన్‌వాడీ కేంద్రం ఇద్దరు టీచర్లు, ఇద్దరు ఆయాలను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించి, కేంద్రం నిర్వహణ బాధ్యతలను బొప్పారం అంగన్‌వాడీ టీచర్‌కు అప్పగించారు.
మెరుగైన వైద్యం అందించాలి
నిడమనూరు : రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డీఎంహెచ్‌ఓ పుట్ల శ్రీనివాస్ కోరారు. మంగళవారం నిడమనూరు పీహెచ్‌సీని ఆయన తనిఖీ చేశారు. ఆస్పత్రిలో అందుతున్న సేవలు, సిబ్బంది హాజరును పరిశీలించారు. డయాబెటిక్, బీపీ బాధితులకు మెరుగైన సేవలందించాలన్నారు. ప్రసూతి సేవలు, చిన్నారులకు టీకాలు సక్రమంగా అందించాలని సూచించారు. ఆయన వెంట మెడికల్ ఆఫీసర్ అరవింద్, డాక్టర్ రమ్య, సీహెచ్‌ఓ రమేష్, ల్యాబ్ టెక్నిషియన్ కృష్ణయ్య, ఎన్‌సీడీ సూపర్‌వైజర్ సోమయ్య, జలీల్ ఉన్నారు.
ఫ పరిమితికి మించి
ఫ పరిమితికి మించి


