ఒకేషనల్ కోర్సులూ అవసరమే..
నల్లగొండ : విద్యార్థులకు అకాడమిక్ విద్య, ఒకేషనల్ కోర్సులు రెండూ అవసరమని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం నల్లగొండలోని రాంనగర్‌లో మైనార్టీ గురుకులంలో విద్యార్థినులకు ఒకేషనల్ కోర్సుల శిక్షణను ఆమె ప్రారంభించి మాట్లాడారు. రెసిడెన్షియల్, కేజీబీవీల్లో చదివే 9, 10 తరగతులు, ఇంటర్ విద్యార్థులకు ఒకేషనల్ కోర్సులపై శిక్షణ ఇస్తామని తెలిపారు. వెబ్ ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటిఫికేషన్, ఎడ్యుకేషనల్, టెక్నికల్ కోర్సులు ఉంటాయని, శిక్షణకు సెట్విన్ సంస్థ సగం ఫీజు రాయితీ ఇస్తుందని, తక్కిన సగం ఫీజును జిల్లా యంత్రంగా తరఫున చెల్లిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఆర్‌ఓ వై.అశోక్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్, వివిధ శాఖ అధికారులు విజయేందర్‌రెడ్డి, డాక్టర్ రమేష్, డీఈఓ భిక్షపతి, డీఐఈఓ దస్రూనాయక్, చత్రునాయక్, సెట్విన్ ప్రతినిధి రేణుక, ప్రిన్సిపాల్ కుబ్రా, జిల్లా సంక్షేమ అధికారి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి


