బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కట్టా అనంతరెడ్డి
రామగిరి(నల్లగొండ): నల్లగొండ బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కట్టా అనంతరెడ్డి గెలుపొందారు. శుక్రవారం నల్లగొండ జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 291 ఓట్లకు గాను 284 ఓట్లు పోలయ్యాయి. ఒక ఓటు చెల్లలేదు. అనంతరెడ్డికి 149, ఏ.సతీష్‌కుమార్ 134 ఓట్లు వచ్చాయి. దీంతో సతీష్‌రెడ్డిపై 15 ఓట్ల మెజారిటీలో అనంతరెడ్డి విజయం సాధించారు. అలాగే జనరల్ సెక్రటరీగా మందా నగేష్, ఉపాధ్యక్షులుగా ఎం.నాగిరెడ్డి, పెరుమాళ్ల శేఖర్, జాయింట్ సెక్రటరీగా ఎండీ.ఫిరోజ్, ట్రెజరర్‌గా బరిగెల నగేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు జిల్లా ప్రధాన జడ్జి నాగరాజును కలవగా ఆయన అభినందించారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కట్టా అనంతరెడ్డి


