పోగొట్టుకున్న సెల్ ఫోన్ అప్పగింత
పెద్దవూర: పోయిన సెల్ ఫోన్‌ను వెతికి పట్టుకున్న పోలీసులు బుధవారం బాధితునికి అప్పగించారు. పెద్దవూర ఎస్‌ఐ పి.వీరబాబు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. పెద్దవూర మండలం చింతపల్లి గ్రామానికి చెందిన చినపాక జానయ్య సెల్ ఫోన్ పోయిందని గత ఫిబ్రవరి 8న పెద్దవూర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే సెల్‌ఫోన్ పోగొట్టుకున్న ప్రాంతం వివరాలతో బాధితుడి పేరు, చిరునామా, గుర్తింపు పత్రం, ఓటీపీ కోసం ఫోన్ నంబర్‌ను ఫిర్యాదులో పొందుపర్చాలని సూచించారు. ఆయా వివరాలతో ఫోర్టల్‌లో నమోదు చేసిన అనంతరం పోగొట్టుకున్న ఫోన్ పనిచేయకుండా బ్లాక్ చేసి, ఎవరు వినియోగిస్తున్నారో గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ) నంబర్ సహాయంతో సెల్ ఫోన్ స్వాధీనం చేసుకుని బాధితుడికి తిరిగి అప్పగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజు యాదవ్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
పది మంది పేకాటరాయుళ్ల అరెస్టు
నల్లగొండ క్రైం: నల్లగొండ పట్టణంలోని రాంనగర్ శివారు ప్రాంతంలో పేకాట ఆడుతున్న పది మందిని వన్‌టౌన్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారినుంచి రూ.43 వేల నగదు, ఐదు బైక్‌లు, పది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ మాట్లాడుతూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు.
నిషేధిత గుట్కా
ప్యాకెట్ల పట్టివేత
వలిగొండ: మండల కేంద్రంలోని ఓ కిరాణ దుకాణంలో అక్రమంగా నిల్వ చేసి విక్రయిస్తున్న రూ.50 వేల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లను భువనగిరి ఎస్‌ఓటీ పోలీసులు బుధవారం పట్టుకుని సీజ్ చేశారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండల కేంద్రంలో రాందేవ్ కిరాణం–జనరల్ స్టోర్ యజమాని చేతన్ ప్రకాష్ వివిధ కంపెనీలకు చెందిన నిషేధిత గుట్కాలను అమ్ముతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి సీజ్ చేసి స్థానిక పోలీసులకు స్వాధీన పరిచారు. షాపు యజమానిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎస్‌ఐ మహేందర్ లాల్ తెలిపారు.
పోగొట్టుకున్న సెల్ ఫోన్ అప్పగింత
పోగొట్టుకున్న సెల్ ఫోన్ అప్పగింత


