మొలకెత్తిన ధాన్యంతో రైతుల నిరసన | - | Sakshi
Sakshi News home page

మొలకెత్తిన ధాన్యంతో రైతుల నిరసన

Jun 12 2026 6:09 AM | Updated on Jun 12 2026 6:09 AM

పాన్‌గల్‌: మండలంలోని తెల్లరాళ్లపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రంలో లారీలు రాక తూకం చేసిన వరి ధాన్యం బస్తాలతో పాటు రైతులు తీసుకొచ్చిన ధాన్యం కుప్పలు పేరుకుపోయాయి. ఇటీవల కురిసిన వర్షానికి బస్తాల్లోని ధాన్యం మొలకెత్తడంతో గురువారం రైతులు నిరసన తెలిపారు. వారికి సీపీఎం మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా రైతులతో కలిసి సీపీఎం మండల కార్యదర్శి బాల్యానాయక్‌ మాట్లాడారు. కేంద్రంలో 60 మంది రైతులకు చెందిన 6 వేలకుపైగా ధాన్యం బస్తాలు లారీలు రాక 50 రోజులుగా నిల్వ ఉన్నాయని, ఇటీవల కురిసిన వర్షానికి సుమారు 100కు పైగా బస్తాల్లోని ధాన్యం మొలకెత్తినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఎకై ్సజ్‌, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కలెక్టర్‌తో కలిసి కొనుగోలు కేంద్రాలను సందర్శించిన సమయంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యం తూకం చేస్తామని, ధాన్యం బస్తాలను తరలిస్తామని హామీ ఇచ్చినా.. చాలా కేంద్రాల్లో నేటికీ ధాన్యం, బస్తాల నిల్వలు పేరుకుపోయాయని, రైతులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికై నా స్పందించి ధాన్యం బస్తాలను తరలించకపోతే రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement