నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు

Jun 10 2026 12:43 AM | Updated on Jun 10 2026 12:43 AM

వెల్దండ: వనమహోత్సవంలో భాగంగా ఏర్పాటుచేసిన నర్సరీల నిర్వహణలో నిర్లక్ష్యం వహించొద్దని.. అన్నిరకాల మొక్కలను పంపిణీకి సిద్ధం చేయాలని జిల్లా క్వాలిటీ కంట్రోల్‌ అధికారి కృష్ణారావు అన్నారు. మంగళవారం వెల్దండ మండలం భర్కత్‌పల్లి, చెర్కూర్‌, పెద్దాపూర్‌, నారాయణపూర్‌, రాఘవయపల్లి, చౌదర్‌పల్లి, కేస్లీతండా, రాచూర్‌, తిమ్మినోనిపల్లి గ్రామాల్లోని నర్సరీల్లో పెంచుతున్న మొక్కల నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సరీల్లో ఎన్ని మొక్కలు పెంచుతున్నారు.. ఏ రకమైన మొక్కలు అందుబాటులో ఉన్నాయనే వివరాలను తెలుసుకున్నారు. వర్షాలు వచ్చే నాటికి మొక్కలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అదే విధంగా మొక్కలు నాటే ప్రదేశాలను గుర్తించి, గుంతలను తీసి సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం గ్రామ పంచాయతీల్లో రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో అధికారులు కృష్ణారావు, అరవింద్‌రెడ్డి, జీవన్‌ ప్రకాశ్‌, క్రాంతికుమార్‌, టీఏలు లింగస్వామి, సత్యనారాయణ, శివలీల తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement