జిల్లాలోని నల్లమల అటవీ ప్రాంతం చుట్టూ ఉన్న మండలాలు, పరిసర గ్రామాల్లో వన్యప్రాణుల కోసం వేట కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా పదర మండలంలోని చిట్లంకుంట, బాపన్‌పాడు, పెట్రాల్‌చేను, ఉడిమిళ్ల, బల్మూర్ మండలం బాణాల, బిళ్లకల్, కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి, ముక్కిడిగుండం, లింగాల మండలంలోని అప్పాయిపల్లి, చెన్నంపల్లి, పద్మనపల్లి, పాత రాయవరం గ్రామాల్లో ఉచ్చులు ఏర్పాటు చేసి వన్యప్రాణులను వేటాడుతున్నట్టు తెలుస్తోంది. అమ్రాబాద్ కోర్ ఏరియాలో అటవీశాఖ అధికారులు పటిష్టంగా సంరక్షణ చేపడుతున్నా.. పరిసర మండలాలు, గ్రామాల్లో మాత్రం నిఘా కరువైంది. ఇదే అదనుగా వేటగాళ్లు పంజా విసురుతున్నారు.


