పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పోటీతత్వాన్ని అలవర్చుకోవాలి

Nov 29 2026 2:23 PM | Updated on Nov 29 2026 2:23 PM

ఏటూరునాగారం: విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని ఎంఈఓ, జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు కొయ్యడ మల్లయ్య సూచించారు. మండల కేంద్రంలోని ఎస్సీ బాయ్స్‌ హాస్టల్‌లో జన విజ్ఞాన వేదిక జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి చెకుముకి సైన్స్‌ సంబురాలు –2026 శనివారం జరిగాయి. ఈ సందర్భంగా పోటీలను ప్రధాన కార్యదర్శి గడ్డి శ్రీనివాస్‌, చెకుముకి జిల్లా కన్వీనర్‌ పల్లె నాగరాజు, రత్నం ప్రవీణ్‌, గడ్డం శ్రీను, కన్నాయిగూడెం ఎంఈఓ సాంబశివరావు నిర్వహించి రాష్ట్ర స్థాయికి ఎంపికై న విజేతలను ప్రకటించారు. జెడ్పీ ఉన్నత పాఠశాల విభాగంలో జెడ్పీహెచ్‌ఎస్‌ మంగపేట విద్యార్థులు, రెసిడెన్షియల్‌ విభాగంలో టీజీఎంఎస్‌ బండారుపల్లి, తెలుగు మీడియం విభాగంలో జెడ్పీహెచ్‌ఎస్‌ వెంకటాపురం, ప్రైవేట్‌ స్కూల్‌ విభాగంలో సెయింట్‌ ఆంటోనీ హైస్కూల్‌ ములుగు విద్యార్థులు ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు వివరించారు.

ఎంఈఓ, జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు మల్లయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement