కొత్త ప్రదేశానికి వెళ్లాలనుకున్నప్పుడు ఎన్నో భయాలుంటాయి. అలాంటిది చదువు కోసమో, ఉద్యోగం కోసమో సముద్రాలు దాటి వెళ్లాలంటే అక్కడ వసతి ఎలా? ఎవరిని సంప్రదించాలి? ఏదైనా సమస్య వస్తే ఎవరు చూసుకుంటారు? ఇలాంటి సందేహాలు విద్యార్థులు, ఉద్యోగార్థుల్లో కోకొల్లలు. సందేహా | - | Sakshi
Sakshi News home page

కొత్త ప్రదేశానికి వెళ్లాలనుకున్నప్పుడు ఎన్నో భయాలుంటాయి. అలాంటిది చదువు కోసమో, ఉద్యోగం కోసమో సముద్రాలు దాటి వెళ్లాలంటే అక్కడ వసతి ఎలా? ఎవరిని సంప్రదించాలి? ఏదైనా సమస్య వస్తే ఎవరు చూసుకుంటారు? ఇలాంటి సందేహాలు విద్యార్థులు, ఉద్యోగార్థుల్లో కోకొల్లలు. సందేహా

Nov 29 2026 2:23 PM | Updated on Nov 29 2026 2:23 PM

వరంగల్‌ జిల్లా నర్సంపేట యువకుడి స్టార్టప్‌

తన కలే.. స్టార్టప్‌నకు బీజం

●

విదేశాల్లో చదువుకోవాలనుకునే చాలామంది యువతకు కచ్చితమైన సమాచారం దొరకక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి విద్యార్థులకు ఒకే వేదికపై పరిష్కారాలు అందించాలన్న ఆలోచనతో రూపుదిద్దుకున్నదే ‘పాక్సోరా’ (పాక్సోరా అంటే న్యూ బిగినింగ్‌ అని అర్థం) స్టార్టప్‌. వరంగల్‌ జిల్లా నర్సంపేటకు చెందిన వంచ అక్షిత్‌రెడ్డి బృందం 15రోజల క్రితం ప్రారంభించిన ఈ స్టార్టప్‌ ప్రస్తుతం పది దేశాల్లో సేవల విస్తరణ దిశగా అడుగులు వేస్తోంది.

డిజిటల్‌ తోడు

విదేశీ విద్యార్థులు వసతి, అక్కడ పార్ట్‌టైం ఉద్యోగావకాశాలు, స్థానిక సమాచారం, ట్యూషన్‌ ఫీజు, అద్దె, ఆహారం, రవాణా వివరాలు వెబ్‌సైట్‌లో ఉంటాయి. దీంతోపాటు యూనివర్సిటీ ఎంపిక నుంచి విదేశాలకు చేరుకొని అక్కడ స్థిరపడే వరకు విద్యార్థి ప్రయాణంలోని వివిధ దశలను అనుసంధానిస్తోంది. ఒకే విద్యార్థి ప్రొఫైల్‌ ద్వారా వసతి, ఉద్యోగాలు, ప్రీ డిపార్చర్‌ సమాచారం, స్టూడెంట్‌ కమ్యూనిటీ, స్థానిక జీవన అవసరాలకు సంబంధించిన సేవలందించేలా వెబ్‌సైట్‌ను రూపుదిద్దారు. వసతి వివరాలను భాగస్వాములు అందించిన తర్వాత పాక్సోరా బృందం మరోసారి పరిశీలించి అందిస్తుంది.

పది దేశాల్లో సేవలు

అమెరికా, ఫ్రాన్స్‌, ఇటలీ, ఆస్ట్రేలియా, యూకే, కెనడా సహా పది దేశాల్లో పాక్సోరా సేవలు విస్తరించాయి. త్వరలో సుమారు 150 మంది విద్యార్థులకు వారు ఎంచుకున్న దేశాల్లో అవసరమైన సేవలందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రీమియం విధానంతోపాటు యూనివర్సిటీ భాగస్వామ్యాలు, ప్రకటనలు, అఫిలియేట్‌ ఆదాయ మార్గాల ద్వారా ఈ స్టార్టప్‌ను విస్తరించాలనుకుంటున్నారు. ‘విదేశాల్లో విద్యార్థులకు వసతి, పార్ట్‌టైమ్‌ ఉద్యోగాల సమాచారం పెద్ద సమస్యగా మారింది. ఆ ఇబ్బందులకు పరిష్కారం చూపాలనే పాక్సోరాను ప్రారంభించాం. కొత్తగా వెళ్లే విద్యార్థులకు అక్కడి స్టూడెంట్‌ కమ్యూనిటీ ఒక సపోర్ట్‌ సిస్టమ్‌లా నిలవాలన్నదే మా లక్ష్యం’ అని అక్షిత్‌రెడ్డి చెబుతున్నాడు.

అబ్రాడ్‌ వెళ్లాలనుకునే

విద్యార్థులకు అండగా వెబ్‌సైట్‌

వసతి నుంచి ఉద్యోగం వరకు

సమాచారమంతా ఒకే దగ్గర..

ముగ్గురు స్నేహితులతో కలిసి

రూపకల్పన

పది దేశాలకు సేవల విస్తరణ

నర్సంపేటలో స్కూలింగ్‌, హనుమకొండలో ఇంటర్‌ పూర్తి చేసిన అక్షిత్‌రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. తొలుత తను కూడా విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలని భావించాడు. ఈక్రమంలో విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులతో మాట్లాడినప్పుడు వారు ఎదుర్కొంటున్న సమస్యలు అతడిని ఆలోచింపజేశాయి. వసతి, పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు, స్థానిక పరిచయాలు, భద్రత వంటి అంశాల్లో ఇబ్బందులను గుర్తించాడు. వాటన్నింటికీ ఒకే వేదిక పరిష్కారం చూపితే బాగుంటుందన్న ఆలోచనకు శ్రీకారం చుట్టాడు. స్నేహితులు శ్రావ్య, హరిణి, విశ్వాణితో కలిసి ‘పాక్సోరా’ వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు. టీమ్‌ లీడర్‌గా అక్షిత్‌, చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌గా శ్రావ్య బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement