సర్వే పకడ్బందీగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

సర్వే పకడ్బందీగా చేపట్టాలి

Nov 29 2026 2:23 PM | Updated on Nov 29 2026 2:23 PM

ఏటూరునాగారం: సర్వేను పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ సూచించారు. మండలంలోని కొండాయి గ్రామంలో భూముల రీసర్వే కార్యక్రమాన్ని ఆయన శనివారం పరిశీలించారు. ఇప్పటివరకు ఎంతవరకు సర్వే చేశారని ఆరా తీశారు. సర్వేలో రైతులు భాగస్వాములు కావాలని కోరారు. అభ్యంతరాలు, సమస్యలు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ జగదీశ్వర్‌, ఆర్‌ఐ కిరణ్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు

త్వరగా పూర్తి చేయాలి

ములుగు: ములుగు మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న డ్రెయినేజీ నిర్మాణ పనులు, పట్టణ ప్రధాన రహదారిపై డివైడర్‌ విస్తరణ పనులను మున్సిపల్‌ కమిషనర్‌ జనగాం సంపత్‌ శనివారం పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యతా ప్రమాణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశిత గడువులోపు నాణ్యతతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ ఇంజనీర్‌ సౌజన్య, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌

పోటీలకు 9మంది ఎంపిక

ఏటూరునాగారం: ఏటూరునాగారం అథ్లెటిక్స్‌ సెంటర్‌ నుంచి 9మంది క్రీడాకారులు ఎంపికై నట్లు కోచ్‌ పర్వతాల కుమార్‌ శనివారం తెలిపారు. ఇటీవల జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్‌లో సాయిదుర్గ, సంజన, దుర్గాభవాని, హర్షిత, గోపిక, భీమయ్య, కార్తీక్‌, రోహిత్‌, సాయి మిథున్‌ పాల్గొని ప్రతిభ కనబర్చి 12వ తెలంగాణ రాష్ట్ర సబ్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాపియషిప్స్‌ –2026 పోటీలకు ఎంపికయ్యారని వివరించారు. నిజామాబాద్‌ జిల్లాలో ఈనెల 30 నుంచి డిసెంబర్‌ 1వ తేదీ వరకు జరగనున్న రాష్ట్రస్థాయి క్రీడల్లో వారు పాల్గొంటారని చెప్పారు. ఈ సందర్భంగా క్రీడాకారులను కోచ్‌ కుమారస్వామితో పాటు మరో కోచ్‌ భావన, తదితరులు అభినందించారు.

రామప్ప దేవాలయంలో అమెరికా దేశస్తుడు

వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయాన్ని అమెరికా దేశానికి చెందిన క్రిస్టాఫా లోప్స్‌ శనివారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వర స్వామిని ఆయన దర్శించుకోగా, ఆలయ అర్చకులు హరీష్‌ శర్మ, ఉమాశంకర్‌లు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ చరిత్ర, కాకతీయుల చరిత్ర గురించి టూరిజం గైడ్‌ గోరంట్ల విజయ్‌ కుమార్‌ వివరించగా, శిల్పకళ సంపద బాగుందని లోప్స్‌ కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement