మహబూబాబాద్ రూరల్ : బీఎస్సీ (ఆనర్స్) ఉద్యాన డిగ్రీ కోర్సులో ప్రవేశాలకు చివరి విడత మాప్ అప్, వాక్ ఇన్ కౌన్సెలింగ్ ఈ నెల 30వ తేదీన నిర్వహించనున్నట్లు ములుగులోని కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం డీన్ డాక్టర్ చీనానాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయానికి పరిధిలోని మోజెర్ల (వనపర్తి జిల్లా), మాల్యాల (మహబూబాబాద్ జిల్లా), అశ్వారావుపేట (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) ఉద్యాన కళాశాలల కేంద్రాల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు తమ టీజీ ఈఏపీసెట్ 2026 ర్యాంక్ వివరాలతోపాటు ప్రవేశానికి అవసరమైన ఒరిజినల్ ధ్రువపత్రాలు, జిరాక్స్ ప్రతులతో హాజరుకావాలని సూచించారు.


