ములుగు రూరల్: మున్సిపాలిటీ పరిధిలో ఇంటి పన్ను, వాణిజ్య పన్నులు, విద్యాసంస్థలపై పెంచిన పన్నులను వెంటనే తగ్గించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం డిమాండ్ చేశారు. ఈ మేరకు గడపగడపకు మున్సిపాలిటీ ముచ్చట్ల కరపత్రాలను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచిన పన్నులు తగ్గించాలని నెల రోజులుగా వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నా పాలకవర్గం, అధికారుల్లో చలనం కూడా లేదని వాపోయారు. కార్యక్రమంలో నాయకులు ఇమ్మడి రాకేష్‌యాదవ్, భాస్కర్‌రెడ్డి, రవీంద్రచారి, శోభన్, రాజ్‌కుమార్, విశ్వనాథ్, రాకేష్, రంజిత్, సాయికుమార్, శిరీష్కుమార్తో పాటు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం


