చట్టాలను యథావిధిగా కొనసాగించాలి | - | Sakshi
Sakshi News home page

చట్టాలను యథావిధిగా కొనసాగించాలి

Aug 24 2026 1:13 AM | Updated on Aug 24 2026 1:13 AM

ములుగు రూరల్‌ : కార్మికులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలను యథావిధిగా కొనసాగించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరాటి ప్రసాద్‌ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలో విశ్రాంత ఉద్యోగుల భవనంలో జంపాల రవీందర్‌ అధ్యక్షతన ఏఐటీయూసీ జిల్లా మూడో మహాసభ నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. అనేక ఏళ్లుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థ కోసం నాలుగు చట్టాలుగా కుదించిందని వివరించారు. దీంతో కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేకుండా పోతుందన్నారు. కార్మికుల హక్కును రక్షించుకోవటం కోసం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాని పిలుపునిచ్చారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ముత్యాల రాజు, ప్రధాన కార్యదర్శిగా బండి నర్సయ్యతో పాటు 15మందితో కూడిన కమిటీని ఎన్నుకున్నారు. నాయకులు పోలం కొండయ్య, పోతిరెడ్డి ప్రమీల, గడ్డం భారతి, కుడుముల సమ్మక్క, రాజకుమారి, రమ, శ్రీనివాస్‌, రాజేందర్‌, దేవేందర్‌, సతీష్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement