
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం రౌధ్రం రణం రుధిరం (ఆర్‌ఆర్‌ఆర్). భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. 'బాహుబలి' తర్వాత రాజమౌళి నుంచి వస్తున్న తొలి సినిమా కావడం, స్వాతంత్ర్య సమరవీరుల పాత్రల్లో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఆర్‌ఆర్‌ఆర్ పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా తెరకెక్కిస్తుంది. ఇటీవల విడుదల చేసిన స్పెషల్ వీడియోలు, పోస్టర్లు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా విడుదలకు ముందే రికార్డు సృష్టించినట్లు తెలుస్తోంది.అన్ని భాషలకు సంబంధించి ఈ సినిమా పోస్ట్ రిలీజ్ డిజిటల్, శాటిలైట్ హక్కులను జీ గ్రూప్ వారు భారీ మొత్తం చెల్లించి సంపాదించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు రూ.325 కోట్లను జీ గ్రూప్ ఈ టీమ్‌కి చెల్లించినట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ ఈ వార్తలే నిజమైతే.. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఓ సినిమా నాన్ థియేట్రికల్ రైట్స్ ఇంత భారీగా పలకడం ఇదే మొదటిసారి అవుతుంది.
దీంతో పాటు ఈ సినిమా ప్రీరిలీజ్ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు, తమిళనాడు, కేరళ, కర్ణాటక, హిందీ వెర్షన్, ఓవర్సీస్ హక్కులు, శాటిలైట్, డిజిటల్ రైట్స్ బిజినెస్ మొత్తం సుమారు రూ.900 కోట్లకు చేరిందని సమాచారం. దీంతో ఇప్పటివరకు ఇండియాలో ఏ సినిమాకు జరగని బిజినెస్ ఆర్ ఆర్ ఆర్‌కు జరిగిందని అంటున్నారు. దీనిపై అధికారిక సమాచారం విడుదలకావాల్సి ఉంది.
యాక్షన్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోమరం భీంగా, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.
చదవండి:
ఈ ఫోటో.. చిరునవ్వులు తీసుకొచ్చింది : నమ్రత
కన్నడ స్టార్ హీరో యష్‌తో పూరి జగన్నాథ్!.. స్టోరీ లైన్ అదేనా?