Yash Chopra Wife Pamela Chopra Passed Away At Age Of 74 In Mumbai - Sakshi
Sakshi News home page

Pamela Chopra Death: బాలీవుడ్‌లో విషాదం.. యశ్ చోప్రా భార్య కన్నుమూత

Apr 20 2023 2:33 PM | Updated on Apr 20 2023 2:41 PM

Yash Chopra Wife Pamela Chopra Passed Away - Sakshi

బాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకనిర్మాత యశ్ చోప్రా భార్య, నిర్మాత‌, సింగ‌ర్ పమేలా(74) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు. మధ్యాహ్నం 11 గంటలకు ముంబైలో ఆమెకు అంత్యక్రియలను కూడా నిర్వహించారు.

పమేలా చోప్రా కు ప్లే బ్యాక్ సింగర్ గా మంచి గుర్తింపు ఉంది. ఆమె సినీ రచయిత, నిర్మాత కూడా. యశ్ చోప్రా 2012లో మృతి చెందారు.  ఆమె కుమారుడు ఆదిత్య చోప్రా ప్ర‌స్తుతం ఫిల్మ్‌మేక‌ర్‌గా ఉన్నారు. మ‌రో కుమారుడు ఉద‌య్ చోప్రా యాక్టింగ్‌లో ఉన్నారు. న‌టి రాణీ ముఖ‌ర్జీని ఆదిత్య చోప్రా పెళ్లాడాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement