'వ్యూహం' సక్సెస్ మీట్.. చంద్రబాబుపై ఆర్జీవీ సెటైర్లు | Sakshi
Sakshi News home page

'వ్యూహం' సినిమా ఆ ముగ్గురికే అంకితం: రామ్ గోపాల్ వర్మ

Published Sat, Mar 2 2024 4:13 PM

Vyuham Movie Success Meet RGV Comments On Chandra Babu  - Sakshi

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన 'వ్యూహం' థియేటర్లలోకి వచ్చేసింది. ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్ లోని ఫిల్మ్‌నగర్‍‌లో సక్సెస మీట్ ఏర్పాటు చేశారు. దర్శకుడు ఆ‍ర్జీవీ అయితే చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్.. ఇలా ముగ్గురిపై సెటైర్లు వేశారు. అలానే నిర్మాత దాసరి కిరణ్ కుమార్ కూడా లోకేష్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

(ఇదీ చదవండి: 'వ్యూహం' సినిమా రివ్యూ)

'ఆరోజు జగన్ గారు జైలు నుంచి వచ్చినట్టు నేడు లోకేష్ వ్యూహం నుంచి సినిమా రిలీజ్ అయినందుకు హ్యాపీగా ఉంది. చంద్రబాబు 53 రోజులు జైల్లో వున్నాడు మా వ్యూహం కూడా 53 రోజులు ఆపారు ఫైనల్‌గా వ్యూహం రిలీజ్ అయ్యింది. సినిమాలో బిహైండ్ సీన్స్‌ని ఆడియెన్స్ చూస్తున్నారు. అసలు కంటెంట్ అంతా 'శపథం'లో ఉంటుంది. 'వ్యూహం'.. 'శపథం' సినిమాకు ట్రైలర్ లాంటిది. పవన్ కళ్యాణ్ ఉంటే ఆ సీన్స్ జనాలకు కామెడీలా అనిపిస్తుంది. నా సినిమా అంకితం ఇచ్చేది చంద్రబాబు లోకేష్ పవన్ కల్యాణ్‌లకే. 'వ్యూహం' హిట్ అయింది. మరి ఇపుడు రఘురామకృష్ణం రాజు తన మాట మీద నుంచుంటాడో లేదో చూడాలి? మా వ్యూహానికి ప్రతి వ్యూహం లోకేష్' అని దర్శకుడు ఆర్జీవీ చెప్పుకొచ్చారు.

నిర్మాత దాసరి కిరణ్ మాట్లాడుతూ.. 'లోకేష్ గత ఆరు నెలల నుంచి వేరే ఏ పని లేకుండా 'వ్యూహం' సినిమా ఆపడమే పనిగా పెట్టుకున్నారు. ఫైనల్‌గా సినిమా రిలీజ్ అయ్యింది. పెద్ద హిట్ అయ్యింది. లోకేష్ ఘోరంగా ఓడిపోయాడు' అని అన్నారు. 

(ఇదీ చదవండి: 'ఇంద్రబాబు' పాత్రకు మించి వర్మ 'వ్యూహం'లో ఏముంది..?)

Advertisement
 
Advertisement
 
Advertisement