'ఇంద్రబాబు' పాత్రకు మించి వర్మ 'వ్యూహం'లో ఏముంది..? | Nara Lokesh Afraid With RGV Vyooham Movie, Know Details Inside - Sakshi
Sakshi News home page

'వర్మ' వ్యూహం దెబ్బకు అల్లాడిపోతున్న పచ్చ బ్యాచ్‌.. సక్సెస్‌ అయిన ఆర్జీవీ

Published Fri, Dec 29 2023 2:52 PM

Nara Lokesh Afraid With RGV Vyooham Movie - Sakshi

టాలీవుడ్‌ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ రామ్ గోపాల్ వర్మ తీసిన 'వ్యూహం' సినిమా నేడు (డిసెంబర్‌ 29) థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ సినిమాను విడుదల కాకుండా ఉండేందుకు నారా లోకేష్‌ కోర్టు మెట్లు ఎక్కాడు. తెలంగాణ  కోర్టు సూచనమేరకు వ్యూహం సినిమాకు తాత్కాలిక బ్రేకులు పడ్డాయి. ఏ ప్రాతిపదికన   సెన్సార్ ఇచ్చారో తెలుపుతూ ఆ రికార్డులను  కోర్టుకు అందించాలని CBFCని కోరింది.  జనవరి 11 వరకు కోర్టు సమయం ఇచ్చింది.

చినబాబుకు నిద్ర లేకుండా చేస్తున్న వర్మ
వ్యూహం సినిమాను అడ్డుకునేందకు కాంగ్రెస్‌, జనసేన, టీడీపీ శ్రేణులు, నారా లోకేష్‌, గంటా శ్రీనివాస్‌, ఎల్లో మీడియా ఇలా ఎందరో వర్మ 'వ్యూహం' సినిమాను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. మొదట సినిమాను అడ్డుకునేందుకు సెన్సార్‌ బోర్డుకు నారా లోకేష్‌ ఫిర్యాదు చేశారు. అప్పుడు  CBFC కూడా సినిమాను మళ్లీ రివ్యూ చేసి 'యూ' సర్టిఫికెట్‌ ఇచ్చింది. దీంతో వర్మ దెబ్బకు బయపడిపోయిన లోకేష్‌ కోర్టుకు వెళ్లాడు.. సినిమా వస్తే ఇంతకాలం బయటకు తెలియని ఎన్నో విషయాలు ప్రపంచానికి తెలుస్తాయనే భయంతో ఆయన కోర్టు మెట్లు ఎక్కాడు. వర్మ వ్యూహానికి చినబాబు లిటిగేషన్‌ పెట్టాడు. తప్పు చేయని వాడిపై ఎన్ని సినిమాలు తీసినా ఎప్పటికీ భయపడడు కదా..! మరి ఎందుకు చినబాబులో ఇంత భయం. 

తప్పు చేయకుంటే ఉలుకు ఎందుకు..?
చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌ ఎవరైనా కానీ గతంలో ఏం చేశారు...? ఉన్నది ఉన్నట్లు ప్రపంచానికి చూపుతాను అని వర్మ అంటున్నాడు. అలా కాకుండా లేనివి ఉన్నట్లు సినిమాలో చూపుతే నిజం ఏంటో టీడీపీ కూడా మరో సినిమా తెరకెక్కించ వచ్చు కదా.. ఎటూ తన వర్గం వారే సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా ఉన్నారు. మరోవైపు ఇప్పటికే ప్యాకేజీ తీసుకుని చంద్రబాబు వెంటే తిరుగుతున్న పవన్‌ కూడా పచ్చ బ్యాచ్‌లోనే ఉన్నాడు.. డబ్బుకు కొదవ లేదు, డైరెక్టర్లకు కొదవ లేదు, చేతిలో రామోజీ ఫిలిమ్‌ సిటీ.. ఇలా ఎన్నో చంద్రబాబు గుప్పెట్లోనే ఉన్నాయి.

మా నాన్నే ఆంధ్ర రాష్ట్రానికి దేవుడు అని సినిమా తియొచ్చు కదా చినబాబు... గతంలో తమరి రాజకీయ జీవితంలో ఎలాంటి వెన్నుపోట్లు లేకుంటే ఒక్క సినిమా తీసి ప్రజలకు చూపించండి.. అందులో నిజం ఉంటే యాత్ర సినిమా మాదిరి సూపర్‌ హిట్‌ చేస్తారు.. లేదంటే తొక్కి పాతరేస్తారు.. ఇప్పుడు వర్మ వ్యూహం సినిమా కూడా అంతే సినిమాలో నిజం ఉంటే ఆదరిస్తారు... లేదంటే వారానికే మరిచిపోతారు...  

వెన్నుపోటు నుంచి బాబు కథ తెలిసిందే కదా..!
వర్మ వ్యూహానికే భయపడిపోయి వ్యవస్థల ద్వారా ఎటాక్‌ చేసి వ్యూహం సినిమాను అడ్డుకునేందుకు చినబాబు నానాపాట్లు పడుతున్నాడు. సినిమా నచ్చితే చూస్తారు లేదంటే వదిలేస్తారు.  మేము సుద్దపూసలం అని చెప్పుకుంటున్న పచ్చ బ్యాచ్‌ మంద.. వర్మ వ్యూహానికి ఎందుకు వణుకుతున్నారు..? గతంలో ఎలాంటి తప్పులు చేయనప్పుడు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు..?   వెన్నుపోటు రాజకీయం నుంచి ఓటుకు నోటు వరకు బాబు గారి చరిత్ర తెలుగు ప్రజలకు తెలిసిందే కదా.. నారా వారి రాజకీయ చరిత్రే ఇదీ.. ఇందులో వర్మ కొత్తగా చూపించేది ఏముంది..? 

మహా అయితే కొత్తగా వచ్చిన ప్యాకేజీ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ను తెరపైకి తీసుకొస్తాడు.  చంద్రబాబు, లోకేష్‌, పవన్‌ కల్యాణ్‌ల రాజీకీయ జీవిత కథ మధ్యయుగం నాటిదికాదు కదా.. నిజం ఎంటో ఇప్పుడున్న వారందరికీ తెలుసు కదా.. వర్మ వ్యూహం సినిమాలో తప్పుంటే వెంటనే సోషల్‌మీడియాలో ఉతికేస్తారు.. నిజం ఉంటే మెచ్చుకుంటారు. అసలు సినిమానే వద్దనుకుంటే చూడకుంటే సరిపోయే.. అలాంటి దానికి ఇంత గోల ఎందుకు చినబాబు.. ఉచితంగానే వ్యూహం సినిమాకు పబ్లిసిటీ వస్తుంది కాబట్టి వర్మ కూడా సరిగ్గా ఉపయోగించుకుంటూ ఎంటర్‌టైన్‌ చేస్తున్నాడు. వర్మకు కూడా కావాల్సింది ఇదే. ఈ విషయంలో ఆయన భారీగానే సక్సెస్‌ అయ్యాడు.

సీనియర్‌ ఎన్టీఆర్‌పై సెటైర్ల సినిమా
సీనియర్‌ ఎన్టీఆర్‌ యుగపురుషుడు, దేవుడు.. అని తెలుగు ప్రజలు అంటారు. అందులో అభ్యంతరం లేదు. అందుకే ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి కూడ ఒక జిల్లాకు ఆయన పేరే పెట్టారు. కానీ నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబీకులు ఎన్టీఆర్‌ను ఆయన చరమాంక దశలో ఒంటరిని చేశారు. కనీసం పండగరోజు కాస్త పప్పన్నం పంపించే వాళ్లు కూడా కాదని ప్రచారం ఉండనే ఉంది. ఈ కారణమే ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీపార్వతి ప్రవేశించడానికి అవకాశం కల్పించిందని రాజకీయ పరిశీలకులు ఇప్పటికీ అంటూ ఉంటారు. అలా ఆ వయసులో తనకు సహాయంగా నిలిచిన ఆమెను ఎన్టీఆర్‌ ప్రేమించాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. అప్పటికే ఆమె మొదటి భర్త నుంచి విడాకులు పొంది ఉంది కాబట్టి ఎన్టీఆర్‌కు భార్య అయ్యింది. రాజకీయంగా కూడా చక్రంతిప్పి ఉండవచ్చు. ఇదే కథతోనే లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రం వచ్చింది. 

చంద్రబాబుపై ఎన్టీఆర్‌ దుమ్మెత్తిపోయలేదా..?

లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌లో వెన్నుపోటు అంకం, ఆ సమయంలో ఎన్టీఆర్‌ అరణ్యరోదన, అదే మనసును కలిచివేసి ఆయన మరణించడం. చరమాంకంలో చంద్రబాబుపై ఎన్టీఆర్‌ దుమ్మెత్తిపోయాడం, చంద్రబాబును ఔరంగజేబుతో పోల్చడం, నీతిమాలిన వాడు అని ఆయన దూషించడం, అందుకు ప్రతిగా బాబు కూడా ఎన్టీఆర్‌పై ధ్వజమెత్తడం. ఎన్టీఆర్‌ను విలువల్లేనివాడిగా చిత్రించడం, ఎన్టీఆర్‌ అవసరం తమకులేదని ప్రకటించడం. వీటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇప్పటికీ ఎల్లో మీడియా పేపర్‌ క్లిప్పింగ్స్‌తో పాటు యూట్యూబ్‌లలో వీడియోలు కూడా ఉన్నాయి. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ చిత్రంలో కూడా వర్మ ఇదే చూపించాడు.. ఒక్క పచ్చ బ్యాచ్‌  మాత్రమే సినిమాను తప్పబట్టింది.. మిగిలన ఎవరూ తప్పబట్టలేదు. కానీ ఎన్టీఆర్‌ అభిమానులు మాత్రం వర్మను అభినందించడం విశేషం.

చంద్రబాబు పాత్ర గత సినిమాల్లోనే ఉంది..  వర్మ చూపించేది ఏంటి..?
సీనియర్‌ ఎన్టీఆర్‌ జీవితం మీద , ఆయన రాజకీయం మీద వ్యంగ్యంగా స్పందిస్తూ వచ్చిన సినిమాలు గతంలో కూడా ఉన్నాయని ప్రత్యేకంగా వివరించనక్కర్లేదు. వాటిల్లో ముఖ్యమైనవి 'నా పిలుపే ప్రభంజనం, మండలాధీశుడు, గండిపేట రహస్యం వంటి చిత్రాలు ఉన్నాయి.  ఈ సినిమాలన్నీ యూట్యూబ్‌లో ఉన్నాయి.  నేటితరం కూడా వీటిని ఆసక్తితో చూస్తోంది. యూట్యూబ్‌లో వీటికి బాగానే ఉన్నాయి వ్యూస్‌. ఎన్టీఆర్‌, చంద్రబాబు నాయుడు, రామోజీరావు.. తదితర నిజజీవిత పాత్రలన్నీ ఈ సినిమాల్లో ఉన్నాయి. అప్పటికి లక్ష్మీపార్వతి ఎన్టీఆర్‌ జీవితంలోకి ప్రవేశించలేదు.

ఈ సినిమాల్లో కథను ఎంతడేర్‌గా చూపించారంటే... చంద్రబాబును ఉద్దేశించినట్టుగా అనిపించే 'ఇంద్రబాబు' పాత్రకు వ్యాంపులతో ఎఫైర్‌ను పెట్టేంత సాహసం చేశారు ఆ సినిమాల మేకర్లు. ఈ సినిమాలు అప్పటికి, ఇప్పటికీ చర్చనీయాంశంగా నిలిచాయి. మండలాధీశుడులో నటుడు కోటా శ్రీనివాసరావు ఎన్టీఆర్‌ పాత్రను పోషిస్తే.. గండిపేట రహస్యంలో థర్టీ ఇయర్స్‌ పృథ్వీ ఎన్టీఆర్‌గా చేశాడు. ఈ సినిమాలు డైరెక్టుగా ఎన్టీఆర్‌ మీద సంధించిన అస్త్రాలు. ఈ సినిమాలు వచ్చినప్పుడు ఎన్టీఆరే వాటిని చూసీ చూడనట్టుగా వదిలేశాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఎన్టీఆరే వాటిని లైట్‌గానే తీసుకున్నాడు. ఆ సినిమాల్లో ఎన్టీఆర్‌ పాత్రలను పోషించిన కోటా, పృథ్వీలపై ఆయా సమయాల్లో దాడులు జరిగాయి. అయితే ఎన్టీఆర్‌ ఆ దాడులను వారించాడంటారు.

Advertisement
Advertisement