'స్టార్‌డ‌మ్ ప‌క్క‌న‌పెట్టి నాకోసం ఫ్రీగా సినిమా చేశాడు' | Sakshi
Sakshi News home page

Shah Rukh Khan: క‌థ విన‌లేదు, జోక్యం చేసుకోలేదు.. ఫ్రెండ్ కోసం ఫ్రీగా.. అదీ అత‌డి గొప్ప‌త‌నం!

Published Thu, Feb 22 2024 12:38 PM

Vivek Vaswani: Shah Rukh Khan Did Not Charge a Penny for This Film - Sakshi

స్నేహం కోసం కొంద‌రు ఏదైనా చేస్తారు. ఫ్రెండ్‌షిప్ కంటే త‌మ‌కు ఏదీ ఎక్కువ కాదంటారు. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ కూడా ఇదే కోవ‌లోకి వ‌స్తాడు. త‌న స్నేహితుడి కోసం స్టార్‌డ‌మ్ ప‌క్క‌న‌పెట్టి ఫ్రీగా సినిమా చేశాడు. అది కూడా స్క్రిప్ట్ విన‌కుండానే! ఆశ్చ‌ర్యంగా ఉంది క‌దూ.. ఆ విష‌యాన్ని తాజాగా చెప్పుకొచ్చాడు నిర్మాత వివేక్ వాస్వామి. ఈయ‌న 2010లో దుల్హ మిల్ గ‌యా అనే సినిమా నిర్మించాడు. ఇందులో ఫ‌ర్దీన్ ఖాన్‌, సుష్మితా సేన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. షారుక్ కీల‌క పాత్ర‌లో న‌టించాడు.

స్క్రిప్ట్ కూడా విన‌కుండానే..
ఆనాటి ముచ్చ‌ట్ల‌ను తాజా ఇంట‌ర్వ్యూలో నెమ‌రేసుకున్నాడు వివేక్ వాస్వామి. సినిమా చేయ‌మ‌ని వివేక్ నా ద‌గ్గ‌ర‌కు రావ‌డం ఇదే తొలిసారి. ఇంకా ఆలోచించాల్సింది ఏముంది? ఈ సినిమా చేస్తున్నాను. అందుకోసం ఒక్క రూపాయి కూడా తీసుకోవ‌డం లేదు అని షారుక్ అన్నాడు. క‌నీసం స్క్రిప్ట్ కూడా విన‌లేదు. అలా అని అతిథి పాత్ర‌లో న‌టించ‌లేదు. సినిమాలో 42 నిమిషాలు క‌నిపిస్తాడు. అందులో ఒక్క స‌న్నివేశం కూడా ఎడిట్ చేయ‌డానికి నేను ఒప్పుకోలేదు. 42 నిమిషాలు అంటే చిన్న విష‌యం కాదు. ఐదు రోజుల్లో అత‌డి సీన్స్ షూట్ చేశాం.

ఐదు రోజుల్లో షూట్ పూర్తి
క‌థ విన‌లేదు. ఎక్క‌డా జోక్యం చేసుకోలేదు. ఇది సీన్‌.. అన్న వెంట‌నే అద్భుతంగా న‌టించేస్తాడు. అది అత‌డి గొప్ప‌త‌నం. రాజు బ‌న్‌గ‌యా జెంటిల్‌మెన్ సినిమాకుగానూ అత‌డు రూ.50 వేలు తీసుకున్నాడు. త‌ను రూ.10వేల‌కు సినిమా చేసిన రోజులు కూడా ఉన్నాయి. అప్ప‌ట్లో నా ఇంట్లోనే ఉండేవాడు. కొత్తగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చే క‌థానాయ‌కుల‌కు రూ.50 వేలు ఇస్తేనే గౌర‌వంగా ఉంటుంది. ఆ మాత్రం ఇవ్వాలి' అని చెప్పుకొచ్చాడు. కాగా రాజు బ‌న్‌గ‌యా జెంటిల్‌మెన్ సినిమాకు వివేక్ స‌హ‌నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించాడు.

చ‌ద‌వండి: ప్రేమ పేరుతో సోదరుడు మోసం.. గంజాయితో పట్టుబడ్డ షణ్ముఖ్‌

Advertisement
 
Advertisement