Vishwak Sen Open Up on His Real Life Love and Breakup Story - Sakshi
Sakshi News home page

Vishwak Sen: అంతా ఓకే అనుకునేసరికి ఆమె నన్ను వదిలేసిన విషయం తెలిసింది

Apr 29 2022 5:45 PM | Updated on Apr 29 2022 6:26 PM

Vishwak Sen Open Up On His Love And Break Up in Chit Chat - Sakshi

 Vishwak Sen Love Breakup Story: 'పాగల్' సినిమా తర్వాత యంగ్‌ హీరో విశ్వక్ సేన్‌ నటించిన తాజా చిత్రం అశోకవనంలో అర్జున కల్యాణం. డైరెక్టర్‌ విద్యా సాగర్‌ చింతా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రుక్సార్‌ దిల్లాన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రారంభం నుంచి ప్రమోషన్స్‌ను కాస్తా డిఫరెంట్‌గా చేస్తున్నారు మేకర్స్‌. ఇందులో భాగంగా ఇన్‌స్టాగ్రామ్‌ సెలబ్రెటీలతో విశ్వక్‌ సేన్‌ ముచ్చటించాడు. ఈ సందర్భంగా మూవీ విశేషాలతో​ పాటు తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నాడు.

చదవండి: ఓటీటీకి ఆచార్య మూవీ, స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

ఈ క్రమంలో ప్రతి సినిమాలో తనకు ఒక బ్రేకప్‌ స్టోరీ ఉన్నట్లు నిజ జీవితంలో ఏదైనా ఉందా? అని ఓ నెటిజన్‌ నుంచి ప్రశ్న ఎదురైంది. దీనికి విశ్వక్‌ స్పందిస్తూ.. ప్రతి ఒక్క మగాడి జీవితం ఖచ్చితంగా ప్రేమ, బ్రేకప్‌ ఉంటుందన్నాడు. అలాగే తన జీవితంలో కూడా ఓ బ్రేకప్‌ స్టోరీ ఉందన్నాడు.  ‘నా జీవితంలో ఒకేసారి లవ్‌లో పడ్డాను. అది కూడా బ్రేకప్‌ అయ్యింది. నా కాలేజీలో రోజుల్లో ఓ అమ్మాయిని ప్రేమించాను. అయితే కాలేజీ మూడేళ్లలో తనతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. కాలేజీ అయిపోయాక తనని ఓ ఫ్రెండ్‌ పార్టీలో కలిశాను. ఓ సంఘటనతో ఇద్దరం దగ్గరయ్యాం’ అని చెప్పుకొచ్చాడు. 

చదవండి: 'ఆచార్య'పై ప్రేక్షకుల రివ్యూ.. ఆడియెన్స్‌ ఏం అంటున్నారంటే..

‘ఇక అంతా ఓకే అనుకున్నాను. కానీ ఎందుకో తెలియదు ఆ అమ్మాయి నన్ను ఎప్పుడో వదిలేసింది. అయితే ఈ విషయం 30 రోజుల తర్వాత నాకు తెలిసింది. తను మొదటి రోజు లేదా 7వ రోజు చెబితే బాగుండేది. కానీ నాకు నెల రోజుల తర్వాత తెలిసింది. అది చాలా బాధాకరం’ అంటూ విశ్వక్‌ చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పటికీ తనని మరిపోలేదని, బ్రేకప్‌ విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా చాలా బాధగా ఉంటుందని విశ్వక్‌ ఎమోషనల్‌ అయ్యాడు. అందుకే తన సినిమాల్లో ఎక్కువగా బ్రేకప్‌ సీన్స్‌ ఉంటాయని, బ్రేకప్‌ అయినప్పుడు ఏడుపు పాటలు కాకుండ కాస్తా జోష్‌ ఉన్న సాంగ్స్‌ పెట్టమని తనే దర్శకులకు చెబుతానన్నాడు. అందుకే తన సినిమాల్లో బ్రేకప్‌ పాటలు కూడా ఫుల్‌ జోష్‌గా ఉంటాయని తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement