Vishwak Sen Ori Devuda Movie Trailer Released Today - Sakshi
Sakshi News home page

Ori Devuda Trailer: 'వైఫ్‌లో ఫ్రెండ్‌ను చూడొచ్చు సార్.. కానీ ఫ్రైండే వైఫ్‌లాగా వచ్చిందా.'.. ట్రైలర్ మామూలుగా లేదుగా..!

Published Fri, Oct 7 2022 6:36 PM

Vishwak Sen Movie Ori Devuda Trailer Released Today - Sakshi

యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటిస్తున్న చిత్రం 'ఓరి దేవుడా'. పీవీపీ సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సంయుక్తంగా దిల్‌ రాజు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ సినిమాకు అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించగా..లియోన్ జేమ్స్ సంగీతం, తరుణ్ భాస్కర్ డైలాగ్స్ సమకూరుస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 

ఈ సినిమాలో విక్టరీ వెంకటేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ విడుదలైన ట్రైలర్ చూస్తుంటే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను తలపించేలా ఉంది. పూరి జగన్నాధ్ 'బ్రేకప్.. ఐ లవ్ బ్రేకప్స్' అంటూ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమైంది.  ట్రైలర్‌ చివర్లో వచ్చే డైలాగ్ 'వైఫ్‌లో ఫ్రెండ్‌ను చూడొచ్చు సార్.. కానీ ఫ్రైండే వైఫ్‌లాగా వచ్చిందా..' విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీపావళి కానుకగా అక్టోబర్ 21న థియేటర్లలో కనువిందు చేయనుంది ఈ చిత్రం.

 

Advertisement
 
Advertisement
 
Advertisement