Vishal And Lakshmi Menon Marriage Rumours Goes Viral - Sakshi
Sakshi News home page

ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌తో విశాల్‌ పెళ్లి ఫిక్స్‌ !

Aug 8 2023 11:45 AM | Updated on Aug 8 2023 12:12 PM

Vishal And Lakshmi Menon Marriage News Viral - Sakshi

కోలీవుడ్‌లో ప్రభు సాలమన్ దర్శకత్వం వహించిన 'కుమ్కీ' చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలో నటి లక్ష్మీ మీనన్ గుర్తింపు తెచ్చుకుంది. దీని తర్వాత జిగుర్తాండ, కుట్టిబులి, పాండియనాడు, నాన్ సికపు మన్మన్, కొంబన్ వంటి చిత్రాల్లో నటించింది. ఈ సినిమాలన్నీ కూడా సూపర్‌ హిట్ అయ్యాయి. విజయ్ సేతుపతి సరసన రెక్కై చిత్రంలో నటించి తమళ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. వేదాళంలో అజిత్‌కి చెల్లెలుగా లక్ష్మీ మీనన్ నటించింది. (ఇదే సినిమాకు రీమేక్‌గా చిరంజీవి 'భోళా శంకర్‌' వస్తున్న విషయం తెలిసిందే). వేదాళం తర్వాత  కొన్నాళ్లుగా లక్ష్మీ మీనన్‌కు సినిమా అవకాశాలు రాలేదు.

(ఇదీ చదవండి: రజినీ కంటే ఆ హీరోయిన్‌కి డబుల్ రెమ్యునరేషన్.. ఎవరో తెలుసా?) 

త్వరలో పెళ్లి
చాలా రోజుల తర్వాత లక్ష్మీ మీనన్ ప్రస్తుతం  చంద్రముఖి 2 చిత్రంలో నటిస్తోంది. 27 ఏళ్ల నటి లక్ష్మీ మీనన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తమిళనాట ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నటుడు విశాల్‌తో ఆమె పెళ్లి జరగబోతుందని కోలీవుడ్‌ ఇండస్ట్రీలో టాక్‌ నడుస్తోంది. దీనిపై అధికారిక సమాచారం వెలువడకపోవడంతో ఇంటర్నెట్‌లో ఈ వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే వారిద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తే ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్‌ పడుతుందని పలువురు తెలుపుతున్నారు.

విశాల్‌తో ప్రేమ 
నటి లక్ష్మీ మీనన్ విశాల్‌తో కలిసి పాండియనాడు (పల్నాడు), ఇంద్రుడు, వంటి సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాల్లో విశాల్‌తో ఆమె కెమిస్ట్రీ బాగా కుదిరిందని, వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కానీ ఆ తర్వాత లక్ష్మీ మీనన్ విశాల్‌తో ఏ సినిమాలోనూ నటించకపోవడం గమనార్హం. ఈ సినిమాల పరిచయం నుంచి వారిద్దరి మధ్య ప్రేమ మొదలైందని తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఇంతవరకు ఇంట్లో వాళ్లకు చెప్పకుండా దాచారని, త్వరలో పెళ్లి చేసుకోవాలనే  ఉద్దేశ్యంతో తాజాగ ఇరుకుటుంబాల పెద్దలకు తెలపడంతోనే ఈ వార్తలు ఇప్పడు ప్రచారంలోకి వచ్చాయని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement