Actress Sridevi Receives Remuneration Higher Than Rajinikanth In 1976 For K Balachander Movie - Sakshi
Sakshi News home page

Rajinikanth: సేమ్ సినిమా.. కానీ హీరోయిన్‌కే డబ్బులు ఎక్కువిచ్చారు!

Published Tue, Aug 8 2023 10:56 AM

Actress Sridevi Remuneration Higher Than Rajinikanth Once - Sakshi

సూపర్‌స్టార్ రజినీకాంత్ మంచి జోష్ మీదున్నారు. ఆగస్టు 10న 'జైలర్' రాబోతుంది. ట్రైలర్ అవి చూస్తుంటే హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు. అయితే ఈ హిట్ రజినీకి చాలా అవసరం. ఎందుకంటే గత కొన్నేళ్లలో  సినిమాలైతే చేస్తున్నారు గానీ సక్సెస్ అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ‍్యంలో 'జైలర్'పై అంచనాలు బాగానే ఉన్నాయి. ఇదంతా పక్కనబెడితే ఓ సినిమా కోసం సూపర్‌స్టార్ కంటే హీరోయిన్‌కే పారితోషికం ఎక్కువిచ్చారు. ఇంతకీ ఆమె ఎవరు? అది ఏ మూవీనే తెలుసా?

ఏ సినిమా?
మీరు ఏ మూవీ తీసుకున్నా దాదాపుగా హీరోయిన్ కంటే హీరోకే పారితోషికం ఎక్కువ ఇస్తుంటారు. ఇక సూపర్‌స్టార్ రజినీకాంత్ లాంటి వాళ్లకైతే ఒక్కో సినిమాకు రూ.100 కోట్లకు పైనే ఉంటుంది. అయితే కెరీర్ ప్రారంభంలో అంటే 1976లో కె.బాలచందర్ దర్శకత్వంలో 'మూండ్రు ముడిచ్చు' అనే సినిమా చేశారు. అంతకు మూడేళ్ల ముందు తెలుగులో వచ్చిన 'ఓ సీత' చిత్రానికి ఇది రీమేక్. ఇందులో నటించినందుకుగానూ రజినీకి రూ.2000 మాత్రమే ఇచ్చారు.

(ఇదీ చదవండి: తన ప్రెగ్నెన్సీ గురించి ఉపాసన ఇంట్రెస్టింగ్ కామెంట్స్!)

హీరోయిన్‌కే ఎక్కువ
ఇదే సినిమాలో హీరోయిన్‌గా చేసిన శ్రీదేవికి మాత్రం రూ.5000 రెమ్యునరేషన్ ఇచ్చారు. ప్రధాన పాత్రలో నటించిన కమల్ హాసన్‌కి మాత్రం రూ.30 వేలు ఇచ్చారు. అప్పటికే కమల్ ఫేమస్ కావడం వల్ల ఇంత మొత్తం ఇచ్చారని శ్రీదేవి గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఏదేమైనా అప్పట్లో రజినీకాంత్ కంటే శ్రీదేవి డబుల్ రెమ్యునరేషన్ తీసుకోవడం ఆశ్చర్యపరిచే విషయం కదా! వీళ్లిద్దరూ కలిసి దాదాపు 18 సినిమాల్లో నటించడం విశేషం.

'జైలర్' సంగతేంటి?
నెల‍్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన 'జైలర్' సినిమాలో.. రజినీకాంత్, రిటైర్డ్ పోలీస్ అధికారిగా నటించారు. కుటుంబంతో కలిసి వాళ్లు చెప్పినట్లు పనులు చేస్తూ ఉండే ఈయన లైఫ్‌లో అనుకోని సంఘటనలు జరుగుతాయి. దీంతో సౌమ్యంగా ఉండే రజినీ కాస్త యాక్షన్‌లోకి దిగుతాడు. మరి చివరకు ఏమైంది? అసలు రజినీ రెచ్చిపోవడానికి కారణమేంటి? అనేదే 'జైలర్' స్టోరీ అనిపిస్తుంది. 

(ఇదీ చదవండి: మిగతా హీరోయిన్లకు సమంతకు ఉన్న తేడా అదే!)

 
Advertisement
 
Advertisement