విజయ్‌కు అరుదైన బహుమానం.. ఫోటోలు వైరల్‌

Vijay Thalapathy Fans Gifted Life Size Statue Erected At Panaiyur - Sakshi

చెన్నై: అభిమానానికి హద్దులు ఉండవని మరోసారి నిరూపించారు. ఒక్కసారి నచ్చితే వారిని గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తారు. గుళ్లు కూడా కట్టించి పూజలు చేస్తారు. ఇందుకు ఉదాహరణ కూడా చూశాం. తాజాగా అలాంటి ఉదంతమే నటుడు విజయ్‌ అభిమానులు చేశారు. కర్ణాటకకు చెందిన విజయ్‌ అభిమానులు ఆయన భారీ శిలా విగ్రహాన్ని తయారు చేయించి కానుగగా అందజేశారు.


కిరీటాన్ని ధరింపజేసి పూలమాలలతో శోభాయమానంగా అలంకరించిన ఈ శిలా విగ్రహాన్ని చెన్నై, పనైయూర్‌లోని విజయ్‌ ప్రజా సంఘం కార్యాలయం ముందు ఏర్పాటు చేశారు. ఆ ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. తన శిలా విగ్రహాన్ని బహుకరించిన కర్ణాటక అభిమానులకు విజయ్‌ ధన్యవాదాలు తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top