
కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి కొత్త సినిమా టైటిల్ ప్రకటించారు. ‘తలైవా తలైవి’ టైటిల్‌ను మేకర్స్ పిక్స్ చేశారు. దీనిని ప్రకటిస్తూ తాజాగా టైటిల్ టీజర్‌ను విడుదల చేశారు. పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంతో జాతీయ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ నిత్యామీనన్ ఆయనకు జోడీగా నటిస్తున్నారు. సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నటుడు యోగిబాబు, సెంబన్ వినోద్ జోస్, దీపా శంకర్, శరవణన్, రోషిణి హరిప్రియన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో విడుదల కానుంది.

ఇకపోతే ఇందులో నటుడు విజయ్ సేతుపతి పరోటా మాస్టర్‌గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం ఆయన కొంత శిక్షణ పొందినట్లు సమాచారం. గతంలో ‘19 (1)(ఎ)’ సినిమాలో విజయ్ సేతుపతి, నిత్యామీనన్ స్క్రీన్ షేర్ చేసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. ఈ ఇద్దరూ పాండిరాజ్ సినిమా కోసం మరోసారి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకులను మెప్పించేలా ఉంది.
నిత్యామీనన్, విజయ్ సేతుపతి కలిసి కిచెన్‌లో వంటను ప్రిపేర్ చేస్తూనే గొడవపడుతూ ఉంటారు. వారిద్దరూ సరదాగా పోట్లాడుకుంటూ భార్యాభర్తలుగా కనిపిస్తారు. ఒకరిపైమరోకరు పెద్దగా అరవడం మొదలు పెడుతారు. అప్పుడు విజయ్ చేసేదేం లేక తన నోటికి టవల్‌ని కట్టుకొని తనలో తాను మాట్లాడుకుంటూ ఉండిపోతాడు. ఈ మూవీలో నిత్యామీనన్ డామినేషన్ ఎక్కువగా కనిపించేలా ఉంది.